Home » టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన

తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనం బాట పట్టబోతున్నారు. ఈ నెల 11 నుండి నాలుగు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. శాసన ఎన్నికల్లోనే కాదు ఆ తర్వాత కూడా రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కి ప్రజలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం లో కూడా బాబు కు షాకులు ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎలాగైనా పార్టీ కి పూర్వ వైభవం తెచ్చేందుకు బాబు & నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జగన్ ఫ్యాన్ గాలి ముందు సైకిల్ నిలబడలేకపోతుంది.
ఈ తరణంలో చంద్రబాబు కుప్పం పర్యటన కు సిద్ధమయ్యారు. ఈ నెల 11 నుంచి నాలుగు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 11న బెంగళూరు మీదుగా రోడ్డు మార్గంలో చంద్రబాబు కుప్పం చేరుకుంటారు. 11, 12వ తేదీల్లో కుప్పం మునిసిపాలిటీ, మండలంలో, 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో, 14న గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో స్థానిక నేతలు నిన్న ఏర్పాట్లను పరిశీలించి, సమీక్షించారు.

Leave a Reply