– ఇవే నీ బినామీ బాగోతాలు
– నీ బండారం బయటపెడుతున్నా
– వీటికేం సమాధానం చెబుతావ్?
– మాజీ మంత్రి అనిల్‌కుమార్ ఆస్తులను డాక్యుమెంట్లతో సహా బయటపెట్టిన టీడీపీ యువనేత లోకేష్
కోవూరు: ఏపీ ఇరిగేషన్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ఆస్తుల చిట్టాను, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బయటపెట్టారు. అనిల్‌కు జిల్లాలో ఉన్న ఆస్తులు, ఆయన బినామీ బండారాన్ని మీడియా సాక్షిగా వెల్లడించారు. లోకేష్‌కు అనిల్ సవాల్ చేసిన మరుసటి రోజునే.. మీడియాతో చిట్‌చాట్ చేసిన లోకేష్ హటాత్తుగా, అనిల్ ఆస్తుల డాక్యుమెంట్లు విడుదల చేశారు. దీనికేం సమాధానం చెబుతావ్ అనిల్ అని ప్రశ్నించటం సంచలనం సృష్టించింది.
మీడియా చిట్‌చాట్‌లో లోకేష్ బయటపెట్టిన అనిల్ ఆస్తుల చిట్టా ఇదే..
– దొంతాలి వద్ద బినామీలు చిరంజీవి, అజంతా పేరు మీద 50 ఎకరాలు. విలువ రూ.10 కోట్లు.
– నాయుడుపేట లో 58 ఎకరాలు బినామీ పేర్లతో. విలువ రూ.100 కోట్లు.
– ఇనుమడుగు సెంటర్ లో బినామీలు రాకేష్, డాక్టర్ అశ్విన్ పేరుతో 400 అంకణాలు. విలువ రూ.10 కోట్లు.
– ఇస్కాన్ సిటీ లో బినామీల పేర్లతో 87 ఎకరాలు. విలువ రూ. 33 కోట్లు.
– అల్లీపురం లో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 42 ఎకరాలు. విలువ రూ.105 కోట్లు. ఇందులో 7 ఎకరాలు ఇరిగేషన్ భూమి.
– సాదరపాళెం లో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 12 ఎకరాలు. విలువ రూ.48 కోట్లు.
– ఒక పెద్ద కాంట్రాక్టర్ నుండి దశల వారీగా అనిల్ బినామీ చిరంజీవి కి కోట్ల రూపాయలు వచ్చాయి.
– బృందావనం లో శెట్టి సురేష్ అనే బినామీ పేరుతో 4 ఎకరాలు. విలువ 25 కోట్లు.
– దామరమడుగు లో బావమరిది పేరుతో 5 ఎకరాలు. విలువ 4 కోట్లు.
– గూడూరు- చెన్నూరు మధ్యలో 120 ఎకరాలు లేపేసాడు. 40 ఎకరాల్లో లే అవుట్ వేసారు.
నెల్లూరు జిల్లా లో పాదయాత్ర సందర్భంగా జగన్ నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీల తో రూపొందించిన పుస్తకాన్నిలోకేష్ విడుదల చేశారు.