Suryaa.co.in

Andhra Pradesh

మూడు పార్టీల జెండాలు వేరైనా… ఎజెండా ఒకటే

-రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం మూడు పార్టీల పొత్తు
-ఎన్డిఎ అజెండా సంక్షేమం, అభివృద్ది, ప్రజా స్వామ్య పరిరక్షణ
-దేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న శక్తి వంతమైన నేత మోదీ
-మోదీ నాయకత్వంలో దేశం 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది
-జగన్ 5 ఏళ్ల పాలనకు అన్ని వర్గాలు బలయ్యాయి
-జగన్ కు సొంత కుటుంబమే ఓటు వెయ్య వద్దని చెపుతోంది
-మోదీ మద్దతుతో రాష్ట్రాన్ని నిలబెడతాం….ప్రజలను గెలిపిస్తాం
-అరాచకం కావాలా… అభివృద్ది కావాలా…ప్రజలు ఆలోచించాలి

పల్నాడు జిల్లా, చిలకలూరిపేటలోని బొప్పూడి ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం:-
•ప్రధాని మోదీ ప్రగతి వాది. మోదీకి 5 కోట్ల తెలుగు ప్రజల తరపున మోదీకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం.
• నేటి ఈ ప్రజాగళం సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ. మీ అందరి ఉత్సాహం చూస్తే అది నిరూపితం అయింది. ప్రజల ఆశలు, ఆకాంక్షలను సాకారం చేసే సభ ఇది.
• ఐదేళ్లలో విధ్వంస, అహంకార, అవినీతి పాలనతో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయి. అందుకే ప్రజల గుండెచప్పుడు బలంగా వినిపించడానికి మూడు పార్టీలు కలిశాయి.
• రేపు జరిగే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పే రాష్ట్ర భవిష్యత్తుకు నిర్ణయిస్తుంది. మీ జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత మాది. మీ మద్ధతు, ఆశీస్సులు మాకు ఇవ్వాలని కోరకుంటున్నా.
• మూడు పార్టీల జెండాల వేరు కావచ్చు..మా అజెండా ఒక్కటే. అదే సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ. ప్రజల కోసం తపించే పవన్ కు అభినందనలు తెలుపుతున్నా.
• మోదీ ఒక వ్యక్తి కాదు..భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. మోడీ అంటే సంక్షేమం…మోడీ అంటే అభివృద్ధి.
• మోడీ అంటే సంస్కరణలు, భవిష్యత్తు. మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం.

• ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్రమోడీ. ప్రధాన మంత్రి అన్నా యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ లాంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చారు.
• సంక్షేమ పథకాలతో పాటు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతిశక్తి, భారత్ మాల కార్యక్రమాలతో నరేంద్ర మోడీ అభివృద్ధి చేశారు.
• పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంక్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోడీ.
• మోడీ నినాదం సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో దేశానికి నమ్మకాన్ని కలిగించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్రమోడీ. కోవిడ్ సమయంలో ప్రపంచంలో ఎవరూ చేయలేని విధంగా నాడు వ్యవహరించి మన ప్రాణాలు రక్షించారు.
• వంద దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతను చాటిచెప్పారు. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను 5వ స్థానంలోకి తెచ్చారు. 5వ స్థానం నుండి రాబోయే రోజుల్లో 3వ స్థానంలోకి వస్తాం. అమెరికా, చైనా కంటే ధీటైన ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చే శక్తి, సామర్థ్యం మోడీకి ఉన్నాయి.

• వికసిత్ భారత్ నరేంద్ర మోదీ కల…వికసిత్ ఏపీ మన అందరి కల కావాలి. వికసిత భారత్ దిశగా దేశం దూసుకుపోతోంది. ఈ ప్రయాణంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ఏపీ కూడా అభివృద్ధి చెందాలి.
• పేదరికం లేని దేశం మోదీ సంకల్పం. ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం. మనమంతా ఆయన ఆశయాలతో అనుసంధానం కావాలి.
• మోదీ జీ కా సందేష్ హై కి ”వికసిత్ భారత్ కేలియే…యహీ సమయ్ హై..సహీ సమయ్ హై”. మై కెహనా చాహ్ తా హూం కి “దేశ్ కో సహీ సమయ్ మే మోదీజీ జైసా సహీ నేతా మిలాహై…ఆప్ కి పూరీ కోషిషోం మే.. హమ్ ఆప్ కే సాత్ రహేంగే. ఏ హమారా వాదా హై.”
• నేను ఒకటే చెప్తున్నా…భారత దేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్రమోదీ. వికసిత భారత్ ద్వారా ప్రపంచంలో నెంబర్ దేశంగా చేసే శక్తి, సామర్థ్యం ఒక్క మోడీకే ఉంది.
• భారతీయులు మొత్తం ప్రపంచంలో శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం. అది ఇప్పటికే జరుగుతోంది. భవిష్యత్తులో ఈ దేశాన్ని పేదరికం లేని దేశంగా చేసే శక్తి ఉంది. దేశం దూసుకుపోతుంది..రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి.

• 2014లో విభజన తర్వాత సవాళ్లు, సమస్యలను అధికమించాం. ఎన్డీయే భాగస్వామిగా ఉండి అనేక కార్యక్రమాలు చేశాం. నాడు 11 జాతీయ విద్యాసంస్థలు కేంద్ర సాహకారంతో తెచ్చాం.
• మోడీ చేతుల మీదుగా అమరావతి నిర్మణం చేపట్టాం…అదే పూర్తైతే దేశంలో మంచి నగరంగా అమరావతి తయారయ్యేది.
• 3 ముక్కలతో అమరావతిని నాశనం చేసి భ్రష్టుపట్టించాడు జగన్మోహన్ రెడ్డి. కేంద్ర సాకారాంతో పోలవరం 72 శాతం పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం గోదావరిలో కలిపింది. ఇలా అన్ని ప్రాజెక్టులు నష్టపోయాయం.
• సహజ వనరులు దోచేశారు. ల్యాండ్, శాండ్, వైన్, అన్నింటిలో వేల కోట్లు దోచుకున్నారు. జె.బ్రాండ్ లిక్కర్ ప్రజల ప్రాణాలు పనంగా పెట్టి ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు జగన్ ఓటేసిన ప్రజలను పన్నుల భారంతో కాటేశాడు.
• పెట్టుబడులు తరిమేశాడు. ఐదేళ్లుగా రోడ్లు, ప్రాజెక్టుల, ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధి అన్న మాటే లేదు. ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు.

• అంతా గంజాయి, అంశాంతి, అభద్రత, ఆందోళనతో బంగారం లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటి చేశారు. విధ్వంసంమే తన విధానంతో రాష్ట్రాన్ని కూల్చేశాడు.
• గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్ అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశాడు.
• కక్ష సాధింపుతో ప్రశ్నించేవారిని, మీడియా వారిని అణచివేసేందుకు పోలీసులను జేబు సంస్థగా మార్చుకున్నారు.
• చివరికి జగన్ అధికార దాహానికి, వంచనకు బాబాయ్ బలయ్యారు. ఇద్దరు చెల్లెల్లు రోడ్లెక్కి వైసీపీ పునాదులు రక్తంలో తడిచిపోయాయని ఘోషిస్తునంనారు. జగన్ కు ఓటేయొద్దని వారే చెప్తున్నారు 5 కోట్ల ప్రజలు అర్థం చేసుకోవాలి.

• రాష్ట్రంలో ఎవరైనా బాగున్నారా…రైతులు బాగున్నారా….యువతకు ఉద్యోగాలు వచ్చాయా.? మహిళలకు భద్రత ఉందా.? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మేలు జరిగిందా? అందరూ నఫ్టపోయారు.
• మోడీకి విన్నవిస్తున్నా…ఏపీ చెత్తపాలనతో ఇబ్బంది పడుతోంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఇవి తెలిస్తే మీకు షాక్ అవుతారు…అప్పుల కోసం కలెక్టర్ కార్యాలయాలు, రైతు బజార్లు, ప్రభుత్వ కాలేజీ స్థలాలు తాకట్టు పెట్టారు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకున్నారు.
• రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరంతా సిద్దమా? ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలబడాలిలి..మనబిడ్డలు జీవితాలు బాగుపడాలి. అందుకే ఈ పొత్తు.

• నిన్ననే ఎన్నికల శంఖారావం మోగింది..ప్రజల్లో ఉత్సాహం పెరిగింది.
• దేశంలో ఎన్డీయేకు 400కుపైగా సీట్లు వస్తాయి. ఏపీలో 25 ఎంపీ సీట్లును గెలిపించాల్సిన బాధ్య మీదే. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి.
• మోడీ నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తే..ఎన్డీయే పాలనలో ఏపీని బాగుచేసుకుందాం. అందరూ సహకరించండి.మద్దతుగా నిలవండి అని కోరుతున్నా అని చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు. జై ఆంధ్రప్రదేశ్, జైభారత్, జైహింద్ అని నినదించారు.

LEAVE A RESPONSE