Suryaa.co.in

Andhra Pradesh

నరేగా బిల్లులపై కోర్టు తీర్పు హర్షణీయం

– వైసీపీ నాయకుల ఒత్తిడికి పనిచేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారు…
– బిల్లులుపై న్యాయ పోరాటానికి అండగా నిలిచిన చంద్రబాబుకు ధన్యవాదాలు
– ఇప్పటికైనా అధికారులు నిబంధనలు మేరకు పనిచేయాలి…
– కోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల్లో పెండింగ్ బిల్లుల చెల్లించాలి
– పనులు చేసిన వారికి బిల్లులు వచ్చే వరకు పోరాటం కొనసాగుతుంది.
– శాసనమండలి మాజీ సభ్యులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్
గత రెండు సంవత్సరాలుగా బిల్లుల కోసం అనేక పోరాటాలు చేశాం. ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్నిసార్లు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కుంటిసాకులతో ప్రభుత్వం బిల్లులు విడుదల జాప్యం చేసింది. విజిలెన్స్ విచారణ, కేంద్రం నిధులు విడుదల చేయలేదని కోర్టుకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చారు. కోర్టు ఆదేశాలతో కొంత మేర పంచాయతీలకు చెల్లింపులు చేసి, వాటిని చేసిన వారికి ఇవ్వకుండా అన్ని రకాలుగా పనులు చేసిన వారిని వేధించారు.
ఉపాధి బిల్లులపై నేటి కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నాం. పనులు చేసిన వారికి ఎలాంటి కోతలు లేకుండా, ఆలస్యమైన కాలానికి నరేగా నిబంధనల ప్రకారం 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని హైకోర్టు ఆదేశించడం సంతోషకరం. అధికారులు ఇప్పటికైనా వై.సీ.పీ నాయకుల ఆదేశాలను కాకుండా న్యాయస్థానం ఆదేశాలను అమలుచేయాలి. పనులు చేసిన వారికి బిల్లులు చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే కోర్టు ధిక్కారణ చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం తీసుకుంటున్న చట్టవిరుద్ధ నిర్ణయాలకు హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిది. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మర్చుకొని తక్షణమే నిధులు విడుదల చేయాలి .

LEAVE A RESPONSE