Suryaa.co.in

Andhra Pradesh

ఒక్క దాడి చేస్తే పది దాడులతో కౌంటర్ అటాక్ ఇస్తాం

– ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకే వైసీపీ నాయకుల దాడులు
– దొంగ కేసులు, దాడులకు భయపడే ప్రసక్తే లేదు
-వైసీపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది
-చంద్రబాబు నాయుడు చేపడుతున్న 36 గంటల దీక్షకు మద్దతుగా నెల్లూరు నుంచి అమరావతికి భారీగా టీడీపీ శ్రేణులు
– నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సీఎం, డీజీపీ, మంత్రుల ప్రోద్బలంతోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగింది ప్రభుత్వ దాడే. పార్టీ కార్యాలయాలతో పాటు ఆస్తులు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కనీసం ఆడబిడ్డలు ఉన్న చోట కూడా మానవత్వం లేకుండా ప్రవర్తించారు. వైసీపీ ప్రభుత్వం నేరాలకు ఘోరాలకు ఈ ఘటన పరాకాష్ట. గత రెండున్నరేళ్లుగా టిడిపి నాయకులపై కేసులు బనాయించడం, దాడులు చేయడం, హత్యలకు పాల్పడడం, వ్యాపారాలు మూతవేడం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు.
రాష్ట్రంలో అన్ని రంగాలు మూతపడ్డాయి, ఏ శాఖలోనూ వృద్ధి లేకుండా పోయింది. ఏ ప్రభుత్వం మారినా సాధారణ పరిపాలన సజావుగా సాగిపోతుంది.. కానీ వైసీపీ ప్రభుత్వంలో పాలనే లేకుండాపోయింది. వైసీపీ ప్రభుత్వంపై జనంలో వస్తున్న వ్యతిరేకతను ఆ పార్టీ వాళ్లు తట్టుకోలేక ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడిన మాటలకు ఇంత కిరాతకంగా ప్రవర్తిస్తే వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు టిడిపి వారిపై మాట్లాడిన భాషకు మేం కత్తులు, తుపాకులు పట్టుకురావాల్నా..ఎక్కడైనా న్యాయం ఉందా.
వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు టిడిపి నాయకులపై అసభ్యకరంగా మాట్లాడుతూ వారి కుటుంబాలను సైతం అగౌరవ పరిచేలా మాట్లాడుతుంటే డీజీపీకి మాత్రం కనపడటం లేదు,వినపడడం లేదు. టిడిపి కార్యాలయం జరిగిన దాడికి నిరసనగా బందుకు పిలుపునిస్తే దేశం పార్టీ నాయకులను బైండోవర్ చేసుకున్న పోలీసులు అందుకు కారణమైన వైసిపి నాయకులు మాత్రం రోడ్లపై ధర్నాలు చేస్తుంటే సపోర్ట్ చేయడం కూడా డీజీపీకి కనపడడం లేదు.
తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే స్టేషన్ లోపల… దాడులకు కారణమైన వైసిపి నాయకులు మాత్రం రోడ్లపైన. దాడులకు కారణమైన వారిని లోపల వేసి బాధితులను రక్షించాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ లాగా వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతూ వాళ్లే కేసులు పెడుతున్నారు.
రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా అమ్ముతుంటే ప్రశ్నించకూడదా? గంజాయి ఇతర మత్తు పదార్ధాల విక్రయాలపై ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల పోలీసులు దాడులు చేస్తుంటే సిగ్గు లేదా? ప్రభుత్వం మత్తు పదార్ధాల వ్యాప్తి ని కంట్రోల్ చేయలేకపోతే ఇతర రాష్ట్రాలు జ్యోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. వైసీపీ ప్రభుత్వం తప్పుడు చేష్టలను ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు 36 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నెల్లూరు నుంచి పెద్ద సంఖ్యలో వెళ్లి ఆయన చేపట్టే దీక్షకు వెళ్లి మద్దతిస్తాం. తెలుగుదేశం పార్టీ శక్తి ఏంటో వైసీపీ వాళ్లకు చూపిస్తాం. దొంగ కేసులు, దాడులు కు భయపడే ప్రసక్తే లేదు. మా వాళ్ళ పై ఒక్క దాడి జరిగితే తిరిగి పది దాడులు జరుగుతాయి. భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో దేశ ప్రజలు అభివృద్ధి వైపు చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి చూస్తోంది. వైసీపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన టైం వచ్చింది.

LEAVE A RESPONSE