Suryaa.co.in

Andhra Pradesh

జంపని షుగర్ ఫ్యాక్టరీ నిధులను పక్కా దారి మళ్లించి వాడేసుకున్నారు

– మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

ఖాయిలా పడ్డ జంపని షుగర్ ఫ్యాక్టరీ పరిశ్రమలకు సంబంధించి ఈ రోజు GO no 15 ఇచ్చాం అని గొప్పలు చెప్పుకుంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.మా నియోజకవర్గం,వేమూరు లో జంపని లో NVR&AVR షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది.ఈ రోజు GO ఇచ్చాం అని చెప్పుకోవడం నాకైతే విచిత్రం గా అనిపిస్తుంది.

మా ప్రభుత్వం అధికారం లో వున్నప్పుడు నేను మంత్రిగా పని చేసినప్పుడు 20.12.2018 న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేసి అందులో అప్రూవ్ చేయించాను. రాష్ట్రం మొత్తం మీద ఖాయిలా పడ్డ పరిశ్రమల కు ఎంత బాకీ లు ఉన్నాయో లెక్క కట్టి NCDC నుండి 200 కోట్లు రుణం తీసుకొనడం జరిగినది.
7.2.2019 న GO no 31 ఇచ్చాం.

మా జంపని షుగర్ ఫ్యాక్టరీ లో 80 మంది పెర్మినెంట్ ఎంప్లాయిస్,200 మంది NMR ఎంప్లాయిస్ వున్నారు. ఎంత అవ్వుతుందో లెక్క చూస్తే దాదాపు 15 కోట్లు అవుతుంది అని అంచనాలు వేయడం జరిగింది. మేము తీసుకెవచ్చిన 200 కోట్లు ల లో 100 కోట్లు రాష్ట్రవ్యాప్తంగా ఖాయిలా పడ్డ పరిశ్రమలకు కాని, రైతుల బకాయిలు కానీ చెల్లించాము.

ఇంకో 100 కోట్లు ఉద్యోగుల శాలరీ కోసం ఉంచాము.ఈ లోపు ఎలక్షన్ కోడ్ రావడం తో ఆ 100 కోట్లు ఇండస్టియల్ సెక్రటరీ అకౌంట్ లో జమ అయ్యాయి.ఈ 3 సంవత్సరాల కాలం లో మీకు చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగులు కి జీతాలు చెల్లించేవారు. ఆ పని చేయలేదు.నిధులను పక్కా దారి మళ్లించి వాడేసుకున్నారు.

జంపని ఫ్యాక్టరీ లో ఈ 3 సంవత్సరాల కాలం లో దాదాపు 50 మంది పెర్మినెంట్ ఉద్యోగులు రిటైర్ అయ్యిపోయారు.వాళ్ళ కడుపులు కొట్టారు.మా హయాంలో కనీసం 2,3 నెలల కి బకాయిలు చెల్లించేవాళ్ళం. జంపని షుగర్ ఫ్యాక్టరీ క్రింద 77 ఎకరాల పొలం ఉంది దాని పై ఈ నాయకుల కన్ను పడింది ఎలా అమ్మాలి అని దొంగ ఆలోచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఉద్యోగస్తులు కి న్యాయం చెయ్యాలి.చేస్తే సంతోషిస్తాం. ఫ్యాక్టరీ ఆస్తుల పై కన్ను వేస్తే ప్రత్యక్ష పోరాటాల కు వెనకాడం.

LEAVE A RESPONSE