విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రి జోగి రమేష్, వైవి సుబ్బారెడ్డి కార్లపై దాడి

– మంత్రి రోజాకు తగిలిన జనసేన సెగ

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రులు రోజా, జోగి రమేశ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడి జరిగింది. మంత్రులు విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తుండగా సరిగ్గా అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల వాహనాలపై కర్రలు, రాళ్లతో జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్‌లు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. దీనిపై మంత్రి జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదని.. జనసేన కార్యకర్తల దాడిలో మా వాళ్లకు దెబ్బలు తగిలాయన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.