Suryaa.co.in

Andhra Pradesh

క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు జనసేన భరోసా

-ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన 12 కుటుంబాలకు రూ.60 లక్షల అందచేత
-స్వయంగా చెక్కులు అందచేసిన పవన్ కళ్యాణ్
-పోలీసుల ఆంక్షల నేపధ్యంలో మీడియా ఎదుట చెక్కుల పంపిణీ

విశాఖపట్నం, : ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు ఆదివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ఆర్ధిక సాయం అందించారు. ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున 12 కుటుంబాలకు రూ.60 లక్షలు చెక్కులను బాధిత కుటుంబాలకు ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన క్రియాశీలక సభ్యులకు షెడ్యూల్ ప్రకారం జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో ఈ చెక్కులు అందచేయాల్సి ఉంది.

సభలు, సమావేశాలు పెట్టడానికి వీల్లేదంటూ పోలీసులు పవన్ కళ్యాణ్ మీద ఆంక్షలు విధించిన క్రమంలో ఆ నోటీసులు స్వీకరించే ముందే మీడియా ఎదుట చెక్కులు పంపిణీ చేశారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన 9 కుటుంబాలకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెండు, విజయనగరం జిల్లాకు చెందిన ఓ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్ధిక సాయం చేశారు. ఈ సందర్భంగా క్రియాశీలక సభ్యుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.

ఆ కుటుంబాలకు జనసేన పార్టీ భవిష్యత్తులోనూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రూ. 5 లక్షల చెక్కులు స్వీకరించిన క్రియాశీలక సభ్యులలో 1. దుర్గాసి హేమలత (దుర్గాసి దేవేంద్ర). 2. హనుమంతు శాంతమ్మ (హనుమంతు ఢిల్లీశ్వరరావు). 3. సంగారెడ్డి అరుణ (సంగారెడ్డి గంగరాజు). 4. బోరా మోహిత్( బోరా వెంకటలక్ష్మి). 5. మోటూరి రాజేశ్వరి (మోటూరు గోవిందు). 6. పవడా జెన్నిఫర్(పవడా రమణకుమార్). 7. గొంతిని దేవి(గొంతిని శ్రీను). 8. పి. కృష్ణవేణి(పాతల అప్పారావు). 9. కుంచా నూకరాజు(కుంచా నూకరాజు). 10. అనిశెట్టి రాజేశ్వరి(అనిశెట్టి శివ). 11. సీతంరెడ్డి భాగ్య(సీతంరెడ్డి రాంబాబు). 12. మల్లిరెడ్డి సత్యవతి(మల్లిరెడ్డి పద్మనాభం) ఉన్నారు.

LEAVE A RESPONSE