Suryaa.co.in

Andhra Pradesh

తూర్పున మొదలైన జనసేన కౌలు రైతు భరోసా యాత్ర

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలసి మండపేట బయలుదేరారు. కౌలు రైతు భరోసా యాత్ర కోసం జిల్లాకు వస్తున్న పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు ఉదయం నుంచే పార్టీ నాయకులతోపాటు వీర మహిళలు, జనసైనికులు మధురపూడి విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. వినామాశ్రయం వెలుపల భారీ గజ మాలలతో ముంచెత్తారు. ఆడపడుచులు హారతులు పట్టగా, జనసైనికుల పూలవర్షంలో తడిసి ముద్దవుతూ.. తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు కదిలారు.image-1

LEAVE A RESPONSE