Suryaa.co.in

Features National

జయహో.. వందే-భారత్ ఎక్స్‌ప్రెస్

– గంటకు 180 కిలోమీటర్ల వేగం
– ఆ ఘనత చూపించని మీడియా

మనకు మన దేశం సాధించిన అతి పెద్ద విజయాలతో పనిలేదు. మన ప్రభుత్వం ప్రజల కోసం రూపొందించిన.. అద్భుత ప్రాజెక్టుల గురించి వినే తీరిక, పట్టించుకునే ఓపిక లేదు. మీడియాకూ అంతే. కూల్చివేతలకు ఇచ్చే ప్రాధాన్యం, నిర్మాణాలకు ఇవ్వదు. మొన్న కూడా అదే జరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, రవాణా వ్యవస్థలో ఓ అద్భుతం. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో రైలు పట్టాలకెక్కితే.. అది మన మీడియాకు పట్టదు. కావాలంటే మీరే చూడండి.

నిన్న, మన వందే-భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ గంటకు 180 కిలోమీటర్ల వేగం సాధించింది. అంత వేగంతో వెళ్లినా, నిండుగా ఉన్న నీళ్ల గ్లాసు తొణకకుండా, బెణకకుండా నిలబడింది. మన దేశపు నిర్మాణ సామర్థ్యం ప్రమాణ పూర్వకంగా నిరూపణ అయింది.

మన ఎలక్ట్రానిక్ మీడియా దౌర్భాగ్యం ఏమంటే..
దేశం సాధించిన ఇంత గొప్ప ఆవిష్కరణ గురించి ఒక్క నిమిషం కూడా చూపలేదు. కానీ, ఢిల్లీలో ట్విన్ టవర్స్ గురించి గంటల కొద్దీ చర్చలు పెట్టారు. దీన్నిబట్టి, మనం చెప్పుకోదగ్గ విజయాలను, పంచుకోవలసిన విషయాలను విస్మరిస్తున్నాము.

2014 వరకు, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అంటే గరిష్ట వేగం 50 – 55 కిలోమీటర్లు (average కాదు, definition). ఆ వేగంతో పోలిస్తే, 180 కిలోమీటర్ల వేగం నిస్సందేహంగా ఘనవిజయం. 2024 చివరిలోగా, మొత్తం 450 రైళ్లు ప్రవేశపెట్టాలని ప్రణాళిక.

2025 తరవాత హైదరాబాద్ నుండి:
– విజయవాడ: 1.5 గంటలు
– బెంగుళూరు: 4.5 గంటలు
– తిరుపతి: 4 గంటలు
– చెన్నై: 4.5 గంటలు
– ముంబై: 4.5 గంటలు
– పుణె: 4 గంటలు
– ఢిల్లీ: 9 గంటలు

– సంపత్‌రాజు

LEAVE A RESPONSE