– లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు

ఉంగుటూరు, సెప్టెంబర్ 03 : మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఝలక్ ఇస్తున్నారు. ఇది వరకే వైసీపీకి పలువురు రాంరాం చెప్పగా.. తాజాగా మరికొందరు లోకేష్ కు జై కొట్టారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని భువనపల్లిలో యువగళం పాదయాత్ర సాగుతుండగా..ఆదివారం లోకేష్ సమక్షంలో తాడేపల్లి 3వ వార్డుకు చెందిన వైసీపీ ముఖ్య నేత సంకురు సతీష్ తో పాటు మరో 20 కుటుంబాలు, 22వ వార్డు నుండి 23 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి లోకేష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లోకేష్ నాయకత్వంపై తాము బలమైన నమ్మకంతోనే టీడీపీలో చేరినట్లు వారన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు, తాడేపల్లి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.