Suryaa.co.in

Andhra Pradesh

రూ. 2లక్షల కోట్లు మా డీబీటీ… మీది డీపీటీ(దోచుకో..పంచుకో..తినుకో…)

– ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ఏ గడపకు వెళ్ళాయో మేం నిరూపిస్తాం.
– దమ్ముంటే చర్చకు రా చంద్రబాబూ..! సవాల్ విసురుతున్నా..
– డీబీటీ ద్వారా దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఖర్చుచేస్తే.. బాబుకు అవినీతిగా కనిపిస్తుందా..?
– శాండ్, మైన్, వైన్.. ఇవన్నీ దోచుకున్నది, దాచుకున్నదీ బాబు హయాంలోనే
– మీ అవినీతి మీద స్టేలు విత్ డ్రా చేసుకుని సీబీఐ విచారణ కోరే దమ్ముందా బాబూ..?
– స్టేలు విత్ డ్రా చేసుకుంటే చంద్రబాబు జైలుకే..
– రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్

రూ. 2 లక్షల కోట్లు అడ్డంగా మీరు తినేశారు
అప్పుడూ, ఇప్పుడూ ఒకటే బడ్జెట్ ఉన్నా, 2014-19 మధ్య చంద్రబాబు, దుష్టచతుష్టయం రూ. 2 లక్షల కోట్లను మూడున్నర సంవత్సరాల్లోనే ప్రజలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా దోచుకో.. పంచుకో.. తినుకో.. (డీపీటీ) స్కీం ద్వారా అడ్డంగా తినేశారని, అదే వైఎస్ జగన్ పాలనలో మూడున్నరేళ్ళలోనే రూ. 2 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్(డీబీటీ) ద్వారా ప్రజలకు నేరుగా బ్యాంకు అకౌంట్లకు, చేతికి అందిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. దమ్ముంటే దీనిపై చంద్రబాబు చర్చకు రావాలని సవాల్ విసిరారు.

స్టేలు విత్ డ్రా చేసుకుంటే చంద్రబాబు జైలుకే..
సంక్షేమ పథకాల ద్వారా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ఈ డిసెంబరు నాటికి దాదాపు రూ. 2 లక్షల కోట్లు ప్రజలకు పంపిణీ చేస్తుంటే… చంద్రబాబు నాయుడు దోపిడీ అంటున్నారు. దేశంలో ఎక్కడాలేని పథకాలు ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్నాయి. సంక్షేమ పథకాల్లో అవినీతి, దోపిడీ జరిగిందని, దమ్ము, ధైర్యం ఉంటే, నిరుపించే సత్తా ఉంటే చర్చకు రావాలని చంద్రబాబు నాయుడుకు బహిరంగ సవాల్‌ చేస్తున్నాం. 2లక్షల కోట్ల అవినీతి కాదు జరిగింది… రెండు లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా, అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లోకి జమ అవుతోంది.

ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి 2 లక్షల కోట్లు రూపాయిలు చీఫ్‌ మినిస్టర్‌ టూ కామన్‌ మెన్‌ (సీఎం టూ సీఎం) వరకూ వెళుతున్న ఈ శుభసందర్భం మాకు పండుగ రోజు. ఇటువంటి పథకాలుగానీ, కార్యక్రమాలు గానీ ఎన్నడైనా చంద్రబాబు చూశారా? ముఖ్యమంత్రి బటన్‌ నొక్కగానే నేరుగా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, రైతన్నలు బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వెళ్లడాన్ని చంద్రబాబు కల్లో కూడా ఊహించి ఉండరు. ఇప్పటికే రూ.1లక్షా 70వేల కోట్లు ప్రజల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ అయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ఆ మిగతా 30వేల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారులకు చేరనున్నాయి. ఇది ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవాలి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. శాండ్‌, వైన్‌, మైన్‌.. అంటూ ఆరోపణలు చేయడం కాదు. ఇవన్నీ మీ ప్రభుత్వ హయాంలో మీరు దోచుకున్నవే. మీ అవినీతిపై న్యాయస్థానాల్లో ఉన్న స్టేలు విత్ డ్రా చేసుకుని, సీబీఐ విచారణ కోరే దమ్ము చంద్రబాబుకు ఉందా..? అని సవాల్‌ విసురుతున్నా. స్టేలు విత్ డ్రా చేసుకుంటే చంద్రబాబు జైలుకే.

బాబుకు వయసు అయిపోయింది.. కొడుకేమో చవట
చంద్రబాబు నాయుడు మాటలు, డైలాగులు చూస్తుంటే నవ్వొస్తోంది. టీడీపీ పార్టీ శ్రేణులకు ఆయన… మీరేమో యుద్ధానికి సిద్ధం కండి, జైలుకు వెళ్లండి, కేసులు పెట్టించుకోండి, కోర్టుల్లో నేను చూసుకుంటాను అని ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. కార్యకర్తలు జైలుకు వెళ్ళాలి, ఆయన, ఆయన కొడుకు మాత్రం ఇంట్లో కూర్చుంటారు. మరోవైపు చంద్రబాబు ఇటీవల కుప్పంలో పర్యటిస్తే… అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోయి ఇంటికి వచ్చేశాడు. కొట్లాడటానికి, పోరాడటానికి చంద్రబాబుకేమో వయసు అయిపోయింది. ఇక కొడుకేమో పనికిరాని చవట, దద్దమ్మ, పప్పు…తుప్పు. వీళ్లేమో ఇళ్లల్లో ఉంటే పార్టీ శ్రేణులు మాత్రం బలైపోవాలా?

వెన్నుపోటు దినాన్ని పండగ చేసుకోవడానికి సిగ్గులేదా..?
27 ఏళ్లు క్రితం ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన సందర్భంగా సెప్టెంబర్‌ 1వ తేదీన చంద్రబాబు పండుగ చేసుకుంటున్నాడు. ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావును వెన్నుపోటు పొడిచి, పార్టీని లాక్కుని, పార్టీ ఆస్తులను లాక్కుని పండుగ చేసుకుంటూ, మళ్లీ అదే నోటితో ఎన్టీఆర్‌ గురించి గొప్పగా చెప్పే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నాడు. ఏమాత్రం సిగ్గు, లజ్జ లేకుండా ఎన్టీఆర్‌ మరణానికి కారణమై, ఆయనకు వెన్నుపోటు పొడిచి, టీడీపీని లాక్కుని సీఎం సీటులో కూర్చున్న రోజును పండుగ చేసుకునే నికృష్ణుడు, నీచుడు చంద్రబాబు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నాం.

సెప్టెంబర్‌ 2వ తేదీ అన్నది.. మనసున్న మంచి మనిషి, ప్రజల గుండెల్లో చిరకాలం చెరగని ముద్ర వేసుకున్న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్థంతి. ఆయన మరణించి 13 ఏళ్లు అవుతుంది. ప్రజలు ఇంకా ఆయనను గుండెల్లో పెట్టుకుని ఊరు, వాడ.. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలంతా ఆ మహనీయుడిని స్మరించుకుంటున్నారు. వైయస్సార్‌కు ఘన నివాళులు అర్పించే రోజు, ఆయన్ను గుర్తుకు తెచ్చుకుని కళ్లవెంట కనీళ్లు తిరిగే రోజు. అయిదు సంవత్సరాల 3 నెలల కాలమే ముఖ్యమంత్రిగా వైయస్సార్‌ గారు పరిపాలన చేసినా… 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో, ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి మహోన్నత కార్యక్రమాలు చేసి, ప్రజల నుంచి భౌతికంగా దూరమైనా, ప్రజలతోనే ఉన్నారు. మహానేత వైఎస్ఆర్‌ను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. ఆయన గురించి నిన్న ప్రజలంతా స్మరించుకునే రోజున… టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు తెగ తపన పడిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తిట్ల పురాణం లంకించుకున్నాడు.

అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలి
సెప్టెంబర్ 1ని అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా టీడీపీ శ్రేణులు జరుపుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే ఒక వెన్నుపోటుదారుడు వెన్నుపోటు ద్వారా అధికార పీఠం ఎక్కిన రోజు. అంతర్జాతీయంగా కూడా ఆయనకు వెన్నుపోటుదారుడనే చాలా పెద్దపేరు ఉంది. అలాంటి వ్యక్తి మా ప్రభుత్వం మీద, మా పార్టీ నాయకుల మీద, వైఎస్సార్‌ గారి గురించి విమర్శలు చేయడమా? వైయస్సార్‌ ప్రజల మనిషి, ఆయన దేవుడు. ప్రజల గుండెల్లో ఎప్పటికీ వైయస్సార్‌ గూడుకట్టుకుని ఉన్నారు. చంద్రబాబు కాదుకదా, ఆయన జేజేమ్మ వచ్చినా రాజశేఖర్‌ రెడ్డిని ప్రజల గుండెల్లో నుంచి చెరపలేరు. ఆ మహనీయుడు పేరు చెబితే ఆరోగ్యశ్రీ, 108, 105, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకాలు ఠక్కున గుర్తుకు వస్తాయి. పేదల గడపల్లో సంక్షేమాన్ని, అభివృద్ధిని నిలిపిన దేవుడు వైయస్సార్‌గారు.
14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు… ఆయన ప్రవేశపెట్టిన, అమలు చేసిన, ప్రజలకు చేరువైన ఒక్క పథకం గురించి చెప్పమంటే, చెప్పలేని స్థితిలో ఉన్నాడు. అదే మా ముఖ్యమంత్రి మూడేళ్ల పాలనలో 30కు పైగా పథకాలను ప్రజలకు చేరువ చేశారు. అలాంటి మనసున్న, మానవత్వం ఉన్న, అవినీతి లేని మా ప్రభుత్వంపై అవినీతి ముద్ర వేయాలని చంద్రబాబు, ఎల్లో మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు.

దింపుడు కల్లం ఆశతో వల్లకాడులో బతుకున్న పార్టీ అది
చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీకి పాడె కట్టి వల్లకాటికి తీసుకువెళ్లే క్రమంలో.. దింపుడు కల్లం ఆశతో బతుకుతున్న పార్టీ అది. అటువంటి టీడీపీని, చంద్రబాబును మోకులు, జేసీబీలు, బుల్‌డోజర్ల పెట్టి, మరోవైపు మీ పచ్చ మీడియా ఛానల్స్‌, పచ్చ పేపర్లు ఎంత తాపత్రయ పడినా ప్రయోజనం శూన్యం. రాజకీయంగా లేపడానికి మీరు విశ్వ ప్రయత్నాలు చేసినా ప్రజలు చంద్రబాబును విశ్వసించరు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పథకం అయినా ప్రజలకు చేరువైందని చెప్పే సత్తా ఉందా?. అయినా చంద్రబాబును, టీడీపీని పైకి లేపాలని పచ్చ పత్రికల ప్రయత్నం ఎందుకని సూటిగా ప్రశ్నిస్తున్నాం. జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఎందుకీ కుట్రలు, తప్పుడు వార్తలు అని అడుగుతున్నాం. ప్రతిరోజు అలాంటి వార్తలు రాయకుంటే రామోజీరావు, రాధాకృష్ణలకు నిద్రపట్టదు. ఏదో ఒకటి ప్రసారం చేయకపోతే టీవీ5 నాయుడుకు కూడా నిద్రరాదు.

జగన్ ని టచ్ చేయలేరు..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పరిపాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ, ప్రతి గడపకు సంక్షేమం అందుతుంది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించడం జరుగుతోంది. బీఆర్‌ అంబేడ్కర్‌ గారి ఆలోచనలు, ఆయన రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారు. మహాత్మ జ్యోతిరావుపూలేగారి ఆశయాలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు అధికారాన్ని, పదవుల్ని కట్టబెట్టారు. దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో మహనీయుల ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా తూ.చ తప్పకుండా పరిపాలన కొనసాగుతుంది.

ఇలాంటి ప్రభుత్వంపై టీడీపీ బురదచల్లే కార్యక్రమం చేస్తుంది. మీ పనికిమాలిన పేపర్లు, టీవీల్లో రూ.2లక్షల కోట్లు అవినీతి జరిగిందంటూ అడ్డగోలు రాతలు రాస్తే ప్రజలు నమ్మరు గాక నమ్మరు. హైదరాబాద్‌లో కూర్చొని ఎల్లో మీడియాలో పనికిమాలిన రాతలు రాయడం, టీవీల్లో ప్రసారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. మీరు ఎన్ని రాతలు రాసినా, మీ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టి పంపించినా, చంద్రబాబు నాయుడు కుప్పంలోనే కుదేలు అయిపోయాడు. నువ్వు మాకు వద్దు బాబూ అంటూ కుప్పం ప్రజలు తిరుగుబాటు చేశారు. మీరు ఎంత అరిచి గీపెట్టినా, తలక్రిందులుగా తపస్సు చేసినా… వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని టచ్‌ కూడా చేయలేరు.

ఓవైపు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున సంస్థలు ముందుకు వస్తుంటే.. చంద్రబాబు మాత్రం ఏపీ పారిశ్రామికంగా వెనుకబడిందని మాట్లాడటం దారుణం. అభివృద్ధి, సంక్షేమం బ్రహ్మాండంగా రాష్ట్రంలో జరుగుతుంటే చూసి తట్టుకోలేక చంద్రబాబుకు కడుపుమంట ఎక్కువైంది. అందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. టీడీపీ వెంటిలేటర్‌ మీద నుంచి. వల్లకాటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. అచ్చెయ్య, బుచ్చెయ్య, గాలి, ధూళి, పయ్యావుల వీళ్ళు అందరూ ఎంత గొంతు చించుకున్నా, వచ్చే ఎన్నికల్లో జగన్ గారి ప్రజా బలం ముందు కొట్టుకుపోతారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన సాగుతోంది. ప్రజల ధనం ప్రజలకే వెళ్లాలి. ఒక వర్గానికో, ఒక సామాజిక వర్గానికో సంపద పరిమితం కాకూడదు. అన్నివర్గాలు, కులాలతో మిళితమైన బాధ్యతగల ప్రభుత్వం మాది. అయినా దుష్ట చతుష్టయం కుట్రలు, కుతంత్రాలు చేస్తామంటే వారిని ప్రజలే కుప్ప కూల్చేస్తారు. రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని తరిమితరిమి కొడతారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడో బొక్కలోకి వెళ్లేవాడు కానీ… కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుని ఆగిపోయాడు.

బాబుకు తెలిసింది దోచుకోవడం, దాచుకోవడమే
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు. అదే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి గడపకు వెళ్ళి, అభివృద్ధిని, సంక్షేమాన్ని వాళ్ళ వద్దకే తీసుకువెళుతున్నాం. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నాం. పథకాలు రాకుంటే ఎందుకు రావడం లేదని క్షేత్రస్థాయిలోనే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి పల్లె అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం పాలన చేస్తోంది. చంద్రబాబు ఎప్పుడైనా ఇలా చేశాడా?.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని, అధికారుల్ని అడ్డుపెట్టుకుని ఏవిధంగా పాలన చేశాడో ప్రజలంతా చూశారు. మా పార్టీ శ్రేణులపై ఏవిధంగా కేసులు పెట్టి, ఇబ్బందులు పెట్టారనేది ప్రజలకు తెలుసు కాబట్టే, కేవలం 23 స్థానాలకే చంద్రబాబు పరిమితం అయ్యాడు. రేపు రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో 175 స్థానాలు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే గెలుచుకోబోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు రాజకీయంగా నూకలు చెల్లిపోయాయి. ముందు కుప్పంలో నీ గతి ఏమవుతుందో చూసుకో. పులివెందులను టచ్‌ చేసే దమ్ము, ధైర్యం ఉందా? పైపెచ్చు మేకపోతు గాంభీర్యం మాటలు. ఎక్కడ నుంచి పోటీ చేసినా చంద్రబాబు నాయుడు పని అవుట్‌.

మోదీ చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతుంటే వాళ్ల చంకల్లో దాక్కుని రామోజీరావు, రాధాకృష్ణ విన్నట్టుగా రాతలు రాస్తున్నారు. ప్రజలు ఛీ కొడుతున్నారన్న సిగ్గూ, ఎగ్గూ లేకుండా, ఆహో చంద్రబాబు.. ఓహో చంద్రబాబు.. అంటూ మీ ఎల్లో మీడియాలో రాతలు రాస్తే ఆయన గొప్పోడు అయిపోతాడా.. ?. వాస్తవాలేమిటో ప్రజలకు బాగా తెలుసు. మీ పిచ్చి రాతలతో ప్రజలను ఎంతోకాలం మభ్యపెట్టలేరు.
అన్న క్యాంటీన్లు అంటూ చంద్రబాబు, టీడీపీ నిత్యం ఎక్కడో ఒకచోట రచ్చ చేస్తున్నారు, ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టే పోటుగాళ్లు అయితే 2014లో ఎందుకు పెట్టలేదు, ఎందుకు అమలు చేయలేదు..?. ఇదంతా ఎల్లో మీడియాలో ప్రచారం కోసం చంద్రబాబు చేస్తున్నదే తప్పితే.. ఎటువంటి చిత్తశుద్ధి లేదు.

LEAVE A RESPONSE