– పవన్ కల్యాణ్‌కు మంత్రి జోగి రమేశ్ బహిరంగ సవాల్
రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగినట్లు ప్రధాని మోడీకి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లేఖ రాయటంపై మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. ఆ లేఖలో సీబీఐతో పాటు ఈడీ ఎంక్వైరీ చేయాలని పవన్ కల్యాణ్ కోరారు. అసలు జనసేన అధ్యక్షుడు ఏ ఆధారాలతో లేఖ రాశారని జోగి రమేశ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలపై వివరాలను వెల్లడించారు.
30.65 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూస్తున్నాయని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఇళ్లలో స్కాం జరిగిందంటూ ప్రధానికి లేఖ రాయటం సరికాదు. ప్రధాని మోడీకి పవన్ కల్యాణ్ రాసిన 13 అంశాలపై మీడియా ద్వారా పూర్తి వివరాలతో సమాధానాన్ని పంపిస్తున్నానని జోగి రమేశ్ తెలిపారు.
ఒక్క రూపాయి అవినీతి జరగలేదు. అంతా ఆన్‌లైన్ పేమెంట్లు. మరి, అవినీతికి ఆస్కారం ఎక్కడ పవన్?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కల్యాణ్‌కు ఇళ్లు ఉందా? ఆధార్ కార్డు ఉందా? డోర్ నెంబర్ ఉందా? కనీసం ఓటు అయినా ఉందా? ఎంత దుర్మార్గులు మీరు. పచ్చి దుర్మార్గుడు అయిన చంద్రబాబు తాబేదారు పవన్ కల్యాణ్ ఏ గడ్డి అయినా కరవటానికి సిద్ధపడతాడు. 75 ఏళ్ల దేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగనటువంటి అభివృద్ధి, సంక్షేమం నాలుగేళ్ల ఎనిమిది నెలల్లో ఇంత అభివృద్ధి జరుగుతోంది. జగనన్న ముఖ్యమంత్రి కాగానే.. పాదయాత్రలో కష్టాలు, కన్నీళ్లు పడ్డ అక్కచెల్లెమ్మలు, నిరుపేదలు గూడులేక నిరాశ్రయులుగా ఉన్న వారికి సీఎం జగన్ అడ్రస్ ఇచ్చారు.
ఎప్పటి నుంచో కలలుగా మిగిలిపోయిన 30.65 లక్షల పేదింటి అక్కచెల్లెమ్మల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు. అక్కచెల్లెమ్మలకు పట్టాలు ఇవ్వటంతో పాటు ఇప్పటికే వారిలో 21.75 లక్షల మందికి గృహ నిర్మాణం చేపట్టారు. కొన్ని లక్షల అక్కచెల్లెమ్మలు గృహ ప్రవేశాలు చేసుకుని జయహో జగనన్న అని నినదిస్తున్నారు. మరి, ఇందులో స్కాం జరుగుతోందా? ఇంటి నిర్మాణానికి చేతికి డబ్బులు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కటీ ఆన్‌లైన్ పేమెంట్ జరుగుతోంది. బుర్ర లేకుండా స్కాం అని పవన్ కల్యాణ్ అనటం ఏమిటి? ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియకుండా పేదల గృహాల మీద స్కాం అని లేఖ రాయటమా?
పవన్ కల్యాణ్ లేఖపై చర్చకు సిద్ధం. పవన్ కల్యాణ్ సిద్ధమా?
పవన్ కల్యాణ్ లేఖలో ప్రతి అంశం మీద చర్చించటానికి సిద్ధంగా ఉన్నాను. చర్చకు పవన్ కల్యాణ్ రావాలి. ఎక్కడైనా ఒక్క రూపాయి తేడా ఉందో చూపించండి. ఎన్నికలు వస్తున్నాయని రాష్ట్రానికి రావటం హోటల్‌లో పడుకోవటం. ఒక గంట కార్యకర్తలతో మాట్లాడి.. 23 గంటలు పడుకోవటం పవన్ కల్యాణ్ చేస్తున్నారు. కాకినాడ చుట్టుప్రక్కల అభివృద్ధి ఎలా జరుగుతుందో వెళ్లి చూడు పవన్ కల్యాణ్. నేడు 17వేలకు పై చిలుకు జగనన్న కాలనీలు కడుతున్నాం. కట్టేవి ఇళ్లు కాదు.
ఊళ్లకు ఊళ్లే వేగంగా శరవేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. పేదల హృదయాల్లో చిరస్థాయిల్లో నిలబడాలని కోరుకుంటున్నాడు కాబట్టే.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. రూ.2.50 లక్షల కోట్లు డీబీటీ ద్వారా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అందించారు. ప్రతి ఇంటిలో ఆనందం.. ప్రతి గ్రామంలో అభివృద్ధిని సీఎం జగన్ చేసి చూపిస్తున్నారు. ఇంతకన్నా ఏమి కావాలి? కళ్లు కుట్టి.. కడుపు మంటతో పచ్చ రోగుల్లా.. ప్రధానికి లేఖలు రాస్తున్నారు.
ఇళ్ల స్థలాలుపై వివరాలు ఇవిగో పవన్..
ప్రభుత్వ ఎంత ఇచ్చామో, ప్రైవేటు వ్యక్తుల నుంచి ఎంత భూమి కొనుగోలు చేశామో వివరాలు పంపిస్తున్నాము. ఎక్కడా కూడా నయాపైసా తేడా ఉండదు. పేపర్, పెన్ను ఉందని ఇంగ్లీషులో నాలుగు మాటలు రాసి ప్రధాని మోడీకి పంపించటం కాదు. ప్రధాని మోడీని ఏమి అడగాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్ ఇవ్వమని అడగాలి.
కేంద్రంలో బీజేపీతో రాష్ట్రంలో టీడీపీతో లింకులు. గృహ నిర్మాణానికి ఇస్తున్న డబ్బులు సరిపోవట్లేదు. ఇంకా పెంచమని మోడీని పవన్ కల్యాణ్ అడిగితే ప్రజలు హర్షిస్తారు. గృహాలు కట్టుకుని సంతోషంగా ఉన్న పేదింటి అక్కచెల్లెమ్మలపై కడుపు మంట ఎందుకు? గృహాలు, ఇళ్ల స్థలాల వివరాలను పవన్ కల్యాణ్‌కు పంపిస్తున్నాం.
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక సాధికార యాత్ర చూసిన తరువాత చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. చంద్రబాబు పార్టీలో ఏ ఒక్క బీసీలు మిగల్లేదు. గత ఎన్నికల ముందు కూడా జయహో బీసీ అని రాజమండ్రిలో చంద్రబాబు సభ పెట్టాడు. అది అట్లర్ ప్లాఫ్ అయిపోయింది. ఈరోజు బీసీలు ఎవ్వరూ టీడీపీలో లేరు. చంద్రబాబు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా.. ఎన్ని పనికిమాలిన వాగ్ధానాలు చేసినా టీడీపీని బీసీలు ఎవ్వరూ నమ్మరు. ఒకప్పుడు బీసీలు టీడీపీని నిలబెడితే వారిని చంద్రబాబు తన్ని తరిమేశారు. నేడు బీసీలు అంతా సీఎం జగన్ వెంట అడుగులో అడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం కావటం ఖాయం.