-వైసిపికి భారీ షాకిచ్చినంద్యాల లాయర్ తాతిరెడ్డి తులసిరెడ్డి
-2వేల మంది అనుచరులతో లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక
యువగళం పాదయాత్ర రాయలసీమను దాటి నెలరోజులైనా అక్కడి వైసిపిలో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. నంద్యాలకు చెందిన వైసిపి నేత, అడ్వకేట్ తాతిరెడ్డి తులసి రెడ్డి తన 2వేలమంది అనుచరులతో వచ్చి యువనేత నారా లోకేష్ సమక్షాన టిడిపిలో చేరి భారీ షాకిచ్చారు. యువగళం పాదయాత్ర కొనసాగుతున్న ఉదయగిరి నియోజకవర్గం పార్లపల్లి వద్ద తులసి రెడ్డి తమ అనుచరులతో వచ్చి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ యువనేత లోకేష్ పసుపుకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వైసిపి అరాచక పాలనను అంతమొందించడానికి కలసి వచ్చే వారందరికీ తెలుగుదేశం పార్టీ ఆహ్వానం పలుకుతుందని లోకేష్ చెప్పారు. సీనియర్లు, కొత్తగా చేరిన వారు కలసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో టిడిపి విజయానికి కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్, కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బి.టి.నాయుడు, మాజీమంత్రులు భూమా అఖిలప్రియ, ఎన్ఎండి ఫరూక్, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన ప్రముఖుల్లో కొత్తపల్లి సర్పంచ్ చాకలి నారాయణ, అయ్యలూరు సర్పంచ్ ఓబులేసు, దళిత బహుజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాలస్వామి, మాజీ వక్ఫ్ బోర్డు మెంబర్ పఠాన్ జాకీర్, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు మండ్ల గురప్ప, బిసి సంక్షేమసంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు వై.నాగశేషుడు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, బిసి, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి రామచంద్రుడు, ఎంఆర్ పిఎస్ నంద్యాలజిల్లా అధ్యక్షుడు ఎన్.లక్ష్మణ్, ఎ.ఈశ్వర్, నంద్యాల పట్టణం, పెదకొట్టాల, కొత్తపల్లి, చాబోలు, అయ్యలూరు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపిటిసిలు ఉన్నారు.