Suryaa.co.in

Telangana

జర్నలిస్టులు ఆత్మహత్య చేసుకోవద్దు: TJSS

-ప్రవీణ్ ఆత్మహత్యకు కారణమైన వార్త యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి
-ప్రవీణ్ కుటుంబానికి వార్తా యాజమాన్యం 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి
-మంగళవారం ఉదయం 11గంటలకు వార్త కార్యాలయం ముందు జర్నలిస్టుల ధర్నా
-జర్నలిస్టు తొందర పడొద్దు మేము అండగా ఉంటాం ఆనంచిన్ని వెంకటేశ్వరరావు, గౌటి రామకృష్ణ
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని వార్త ప్రత్రిక రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ గౌడ్ ని వార్త సంస్థ పెడుతున్న మానసిక ఒత్తిడి ని తట్టుకోలేక చెరువు లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఈ సంఘటనపై తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ప్రధాన పత్రికల పేరుతో కొన్ని పత్రికలు జర్నలిస్టులపై తీవ్రమైన వత్తిడి చేస్తూ అడ్వర్టైజ్మెంట్లు, సర్క్యులేషన్ పేరుతో స్థానిక రిపోర్టర్ల పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి వారిని నలుగురిలో అవమానం చేయడంతోపాటు కించపరచడం మామూలుగా మారింది ఈ సంస్కృతికి చెక్ పెట్టాలని ఆనంచిన్ని, రామకృష్ణ కోరుతున్నారు.
అదేవిధంగా ప్రవీణ్ ఆత్మహత్యకు కారణమైన వార్త యాజమాన్యం పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు సోమవారం ఉదయం 11:30 గంటలకు ఫిర్యాదు చేస్తామని ప్రవీణ్ కుటుంబాన్ని ఆదుకోవడానికి వార్తా సంస్థ యజమాన్యం 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు లోయర్ ట్యాంక్ బండ్ లో ని వార్త కార్యాలయం ముందు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు హాజరై జర్నలిస్టుల ఐక్యతను చాటాలని వారి కష్టసుఖాల్లో భాగం కావాలని పిలుపునిచ్చారు.
ప్రవీణ్ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చేవరకు ఈ పోరాటం ఆగదని ఆనంచిన్ని వెంకటేశ్వరరావు, గౌటి రామకృష్ణ తెలిపారు. స్టాఫ్ రిపోర్టర్ తమ సంస్థ వాట్సప్ గ్రూప్ లో ఉన్న పెడింగ్ డబ్బులను వెంటనే చెల్లించాలి అంటూ అందరి ముందు పరువును తీసున్నారని మానసిక అన్ని రకాలుగా హింసించడం ద్వారా నే తాను మృతి చెందుతున్నట్టు సూసైడ్ ఉత్తరం రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు కాబట్టి వెంటనే వార్త యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని భవిష్యత్తులో జర్నలిస్టులకు సంస్థలు ఇబ్బంది పెట్టవద్దని జర్నలిస్టుకు యజమాన్యాలు ఇబ్బంది పెడితే జర్నలిస్టుల పక్షాన నిలబడి పోరాడడానికి TJSS ముందుంటుందని తెలిపారు.

LEAVE A RESPONSE