బెజవాడలో బెంబేలెత్తుతున్న బిల్డర్స్
మీడియా కంటే మిడతల దండే నయం
వార్తల కోసం నిజమైన విలేకరులు
ప్రజాస్వామ్యంలో పాత్రికేయ వ్యవస్థదే పెద్దపీట… ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ నేటి వ్యవస్థలో నాలుగో స్థంభంగా మీడియా ఉంది. అలాంటి మీడియాకు నేడు మరకలు తెచ్చే విధంగా కొంతమంది వసూళ్లు రాజాలు తయారు అయ్యారు అనేది జగమెరిగిన సత్యం. వీరికి వార్తలతో పని ఉండదు… కేవలం కలెక్షన్లు కోసమే ఏదో కార్డును అడ్డుపెట్టుకుని తిరుగుతారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల విజయవాడ నగరంలో పలు సంఘటనలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. బెజవాడలో విలేకరులు అంటేనే బిల్డర్స్ బెంబేలెత్తుతున్నారు. ఇటీవల బిల్డింగ్ యజమానుల దగ్గరకు వెళ్లి ఓ బ్యాచ్ బెదిరింపులకు దిగటంతో వీడియో తీసి చేసేదిలేక పోలీస్ స్టేషన్ వరకు పంచాయితీ వెళ్లింది. నకిలీ కార్డులు ఇచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ ఓ బిల్డర్ వారిపై ఫిర్యాదు చేసిన సంఘటన తెలిసిందే. అంతెందుకు ఇటీవల కూడా కారం అమ్ముకుని వ్యక్తిని కూడా వదలకుండా వసూళ్లు రాజాలు వత్తిడి తెచ్చారు.
కారం మిల్లు యజమాని కూడా ఏదో తాగి చస్తానంటూ సదరు విలేకరులను బెదిరించే వరకు అక్కడి నుండి వెళ్లలేదు. ఇటీవల విలేక రుల మంటూ అనేకచోట్ల వసూళ్లే లక్ష్యంగా కదులుతున్నారు. గతంలో విజయవాడ నగరంలోని కార్పోరేటర్లు కూడా బిల్డింగ్ కట్టుకోవాలంటే భయం వేస్తుందని ఏకంగా కమీషనర్కు పిర్యాదు చేశారు. అసలు విలేకరులు ఎండనకా వాననకా వార్తల కోసం సమాజంలో జరిగే అక్రమాలను అన్యాయాలను ప్రశ్నించేందుకు ముందుకు సాగుతుంటే వీరు మాత్రం ప్రాంతాలకు అతీతంగా ఏకంగా పక్క జిల్లాల నుంచి సైతం విజయవాడలోకి వసూళ్లకు వస్తున్నారు అనేది విమర్శలు వినిపిస్తున్నాయి.
వీరిని ప్రశ్నించేది ఎవరు? జర్నలిజాన్ని కాపాడే వారు లేరా..? అంటూ పలు వురు నేతలు గగ్గోలు పెడుతున్నారు. అందరూ ఏక తాటిపైకి వచ్చి పాత్రికేయ వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చే వారిని నియంత్రించేలా చూడాలని పలువురు కోరుతు న్నారు. ఇలాంటి వాటి వలన జర్నలిజానికి మరకలు అంటుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఇందులోనూ కొందరు ముదురులు లేకపోలేదు. యాన్ని ప్రశ్నించి వార్తలు రాస్తే కూడా మమ్మల్ని బెదిరిం చారని డబ్బులు అడిగారు అని కేసులు పెట్ట పరిపాటిగా మారడంతో సమాజంలో ఇలాంటి వారి మాటలు కూడా నమ్మడం లేదు. ఇప్పటికైనా వార్తలు రాసి విలేకరులుపై కేసులు పెట్టడమే కాక వసూళ్లు కోసం వేధించేవారిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.