Suryaa.co.in

Andhra Pradesh

పవన్ ను కలసిన జర్నలిస్టులు

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజె) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసింది. గతవారం జరిగిన ఏపీయూడబ్ల్యూజే సమావేశానికి రావాలని పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర ప్రతినిధులు కోరారు. అయితే ఆయన యాగ నిర్వహణలో ఉండడంతో తాను రాలేకపోయానని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తాను పోరాడుతానని జర్నలిస్టులకు అండగా ఉంటానని లేఖ రాశారు.

ఈ నేపథ్యంలో ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి డి హెచ్ వి సాంబశివరావు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం, పవన్ కళ్యాణ్ ను గొల్లప్రోలు క్యాంపులో కలిసింది .లేఖ ద్వారా మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది.ఈ ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో అక్రిడేషన్ కార్డులు రావడం లేదు. జర్నలిస్టులకు పలు సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం తమకు సహకరించాలని కోరారు.

వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించారు. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సమస్యలు ఉన్నప్పుడు జర్నలిస్టులు కలిసారు. తాను వెంటనే అప్పటి ప్రభుత్వంతో మాట్లాడాను. ఇప్పుడు కూడా జర్నలిస్టులకు వెన్నంటి ఉంటాను. వారు కూడా సమాజంలో కీలకమైన వారు .వారి సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ప్రభుత్వంపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వర్మ, కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE