– గుడివాడ అమర్నాథ్ భార్య చెప్పిన విషయాలు రెండో ఎపిసోడ్ లో బయటపెడతాం
• వృద్ధ బానిస అంబటి రాంబాబు… యువ బానిస అమర్నాథ్
– • మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ బాగోతాలపై రసికరాజాలు అనే సినిమా తీస్తాం
– వచ్చే ఎన్నికల్లో వైసీపీ 15 సీట్లకే మీరు పరిమితం
• మీ శాఖల్లో ఏం జరుగుతుందో మీకు తెలియని విచిత్ర మంత్రులు మీరు
– జగన్ కు కాపలా కుక్కలా మొరగకండి. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కాపలా కాయండి
• మాఫియా తరహాలో సజ్జలతో పాలన చేయిస్తున్న మీరా మాకు చెప్పేది?
• అన్ని రంగాలకు అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్
• జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని ఎవరికో దత్తపుత్రుడు, దగ్గరి పుత్రుడు అంటున్న వైసీపీని 15 సీట్లకే పరిమితం చేస్తామని… అలా చేసే సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని వైసీపీవాళ్ళు గుర్తుపెట్టుకోవాలని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌పై మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. సున్నా పరిజ్ఞానం ఉన్న మంత్రులను ఎదుట పెట్టి, వెనుక సజ్జలతో మాఫియా ఆటను ప్రభుత్వం ఆడిస్తోందన్నారు.
ఈ సమావేశంలో హరిప్రసాద్ మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ ని తిడితేనే ప్రజలు గుర్తిస్తారు అని మంత్రులు భావిస్తున్నారు. ఆయనను తిట్టించేందుకే మీ ముఖ్యమంత్రి మీకు పదవులను ఇచ్చాడు అని తెలుసుకోండి. తాడేపల్లి బంగళాలో భయపడుతూ కొన్ని కుక్కల్ని పవన్ కళ్యాణ్ మీద ఉసిగొలిపే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులు ఈ ముఖ్యమంత్రిని భయపెట్టాలి లేదా బాధ పెట్టాలి. దీని వల్లనే మంత్రులను రేసు కుక్కల్లా మా మీదకు పంపుతున్నారు.
• ఏ మంత్రికీ తన శాఖ మీద పట్టు లేదు
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లో కొత్తగా వచ్చిన ఏ మంత్రికీ ఆ శాఖ మీద పట్టు లేదు. కనీసం ఆ శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయం. రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం మేలు చేసిందో చెప్పాలి. మంత్రులు ఆయా శాఖల వారీగా ప్రజలకు ఎంతమేర ఉపయోగపడ్డారో వివరించాలి. అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేసి ఆనందం పొందడం సరికాదు. మేం కూడా మీ వ్యక్తిగత విషయాల్లోకి వస్తే తల ఎక్కడ పెట్టుకుంటారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో కార్మికులకు అండగా, భవన నిర్మాణ కార్మికులు అసంఘటిత కార్మికులకు తోడుగా, ఉద్యోగులకు చేదోడుగా, అన్నదాతలకు ఆపద్బాంధవుడిగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. ప్రజల్లో పవన్ కళ్యాణ్ మీద మారుతున్న ఆలోచన తీరు కు భయపడే మీరు ఇప్పుడు వ్యక్తిగత విషయాల ప్రస్తావన చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు” అన్నారు.
• సంజనా-సుకన్య ప్రాజెక్ట్ అంటే పూర్తి చేస్తారేమో?: కిరణ్ రాయల్
వైఎస్ఆర్సీపీ అధినేత సీబీఐ దత్తపుత్రుడు అయితే, వైయస్ఆర్ సీపీ నాయకులు ప్రశాంత్ కిషోర్ దత్తపుత్రులు. ప్రశాంత్ కిషోర్ లేకుంటే కనీసం ఓట్లు, సీట్లు కూడా రాని దౌర్భాగ్య పార్టీ మీది అని జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ “ప్రజా మద్దతు కూడగడుతున్న పవన్ కళ్యాణ్ మీదికి విష సర్పాలను వదిలిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. ఇలాంటి విష సర్పాలు ఎన్ని వచ్చినా అడ్డుకునే శక్తి పవన్ కళ్యాణ్ కి ఉంది. సి.బి.ఐ. దత్త పుత్రుడి వృద్ధ బానిస అంబటి రాంబాబుకి ఇరిగేషన్ శాఖ ఇవ్వడం దౌర్భాగ్యం. ఆయనకు డయాఫ్రం వాల్ అంటే తెలియదు, టి.ఎం.సి. అంటే తెలియదు, పులిచింతల ఏ నది మీద ఉందో తెలియదు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదట. సంజనా, సుకన్యా ప్రాజెక్ట్ అంటే గంట, అర గంటలో పూర్తి చేస్తాడేమో?
యువ బానిస గుడివాడ అమర్నాథ్ ఎక్కువ మాట్లాడుతున్నాడు. అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆయన భార్య గారు చెప్పిన విషయాలు రెండో ఎపిసోడ్ లో బయటపెడతాం. వ్యక్తిగత విషయాల వరకూ వస్తే మీకు తెలియకుండానే మీ చీకటి బాగోతాలు రసికరాజాలు అనే టైటిల్ తో సినిమా తీస్తాం. ఈ సినిమాను రాజ్ కుంద్రా ద్వారా రిలీజ్ చేయిస్తాం. జగన్ కు కాపలా కుక్కలా మొరగకండి. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కాపలా కాయండి. మీ అసందర్భ వాగుడుకు ఇప్పుడు చెప్పులు, చేటలు చూపించి వదిలేస్తున్నాం. భవిష్యత్తులో ఇదే కనుక మీరు అవలంబిస్తే మరిన్ని చూడాల్సి వస్తుంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ మాకు సూచించిన శాంతియుత మార్గం లోనే ముందుకు వెళ్తాం. మీరు శ్రుతిమించితే మా వీర మహిళలే మీ భరతం పడతారు. అప్పుడు కనీసం ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి వస్తుంద”న్నారు.