సంజనా-సుకన్య ప్రాజెక్ట్ అంటే అరగంటలో పూర్తి చేస్తారేమో?

– • సీబీఐ దత్తపుత్రుడు.. బాత్రూమ్ లో బాబాయ్.. సంజనా సౌఖ్యమా.. సినిమాలు తీస్తాం
– కృష్ణా, గోదావరి అంటే అమ్మాయిల పేర్లు అనుకుంటున్నారు. అవి అమ్మాయిల పేర్లు కాదు.. అవి నదులు. సంజన, సుకన్య కాదు
– – జలవనరుల శాఖ మంత్రి జలవనరుల శాఖ అంటే స్విమింగ్ పూల్ శాఖ అనుకుంటున్నారు
అబద్ధపు హామీలు.. మోసపూరిత మాటలు.. కుట్రపూరిత ప్రకటనలు.. ఇదే వైసీపీ మూడేళ్ల పాలన
• సిబిఐ దత్తపుత్రుడు జగన్ రెడ్డి పాలనలో ప్రతి రైతు కుటుంబం కన్నీరు పెడుతోంది
• మూడేళ్ల పాలనలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
• ఇంతకు మించి రైతు ద్రోహం ఏముంది?
• పవన్ కళ్యాణ్ యాత్రతోనే దున్నపోతు ప్రభుత్వంలో చలనం
• పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని వ్యక్తి నీటిపారుదల శాఖ మంత్రి
• పవన్ కళ్యాణ్ రైతు మిత్రుడు అయితే.. జగన్ రెడ్డి రైతు వంచకుడు
• విజయవాడలో మీడియాతో జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్

అబద్దపు హామీలు. మోస పూరిత మాటలు.. కుట్ర పూరిత ప్రకటనలు.. వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో హైలెట్స్ అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు. వైసీపీ మూడేళ్ల పాలనలో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబం కన్నీరు పెడుతోందని అన్నారు. పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రతో వైసీపీ ప్రభుత్వంలో భయం మొదలయ్యిందని, అందుకే మూడేళ్ల నుంచి గుర్తుకు రాని కౌలు రైతులు ఇప్పుడు గుర్తుకువచ్చారని స్పష్టం చేశారు.

అన్ని రకాలుగా రైతుల్ని ఇబ్బందిపెడుతున్న ముఖ్యమంత్రి రైతు వంచకుడని మండిపడ్డారు. కౌలు రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే ఆత్మహత్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ “ పవన్ కళ్యాణ్ ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ధైర్యం నింపేందుకు, వారికి ఆర్థిక సాయం చేసేందుకు భరోసా యాత్ర చేస్తుంటే.. రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపుతుంటే వైసీపీ ప్రభుత్వానికి భయం మొదలయ్యింది. మూడేళ్ల పాలనలో ఎప్పుడూ గుర్తుకురాని కౌలు రైతుల సంక్షేమ, ఆత్మహత్యలు పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఇప్పుడు గుర్తుకొచ్చాయి. ఆఘమేఘాల మీద పరుగులు పెట్టి రూ.7 లక్షల పరిహారం ఇస్తామంటున్నారు. పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రతో ఈ దున్నపోతు ప్రభుత్వంలో చలనం వచ్చింది. జనసేన యాత్రకు ముందు ఈ ప్రభుత్వం కనీసం పది మంది రైతులకు కూడా పరిహారం చెల్లించింది లేదు. వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే ఈ మూడేళ్లలో కౌలు రైతుల ఆత్మహత్యల మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. మూడేళ్లలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది రైతు ద్రోహ ప్రభుత్వం.

• ఇది ఐరెన్ లెగ్ పాలన
సిబిఐ దత్తపుత్రుడు జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కుటుంబం కన్నీరు పెడుతోంది. ఐరన్ లెగ్ పాలనలో చేతి దాకా వచ్చిన పంట నోటికి అందకుండా పోతోంది. కోతలు కోసే సమయానికి అకాల వర్షాలు, తుఫానులతో పంటలు కొట్టుకుపోతున్నాయి. రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉంటే అందులో 50 వేల మందికి కూడా రైతు భరోసా పథకం ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 26 వేల మందికి, రెండో ఏడాది 35 వేల మందికి మాత్రమే కౌలు రైతు కార్డులు ఇచ్చారు.
అదీ 11 నెలల పరిమితితో. ఈ ఏడాది ఎంత మందికి ఇచ్చారో తెలియదు. కౌలు రైతు కార్డు లేకపోతు పండించిన ధాన్యం ఎలా అమ్ముకోవాలి. కౌలు కార్డుల పేరు చెప్పి రైతుల్ని రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిప్పుకుంటున్నారు. చివరికి మార్కెట్ లో వైసీపీ నాయకులకు అమ్ముకునేలా కుట్రలు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలతో నిజంగా రైతుల ఇబ్బందులు తగ్గాయో? పెరిగాయో సమాధానం చెప్పాలి.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నామని చెబుతున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో రూ. 12,500 ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 13,500 అన్నారు. కేంద్రం ఇచ్చే రూ. 6 వేలతో కలిపి రూ. 19,500 ఇవ్వాలి. రూ. 13,500 ఇచ్చి సరిపెడుతున్నారు. అందులో కేంద్ర సాయం తీసేస్తే మీరుస్తుంది కేవలం రూ. 7,000. దీన్ని పెట్టుబడి సాయం అంటారా? పెట్టుబడి మోసం అంటారా? మీరు ఇస్తానన్నది ఎంత? ఇస్తుంది ఎంత? మీ మ్యానిఫెస్టోలో పెట్టింది ఎంత? ఇప్పుడు ఇస్తుంది ఎంత? దీనికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి?

• వైసీపీ పాలనలో రైతులకు దక్కిన మేలేమిటి?
పవన్ కల్యాణ్ కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి రూ. లక్ష ఆర్ధిక సాయం చేయడంతో పాటు ఆ కుటుంబాల్లో చదువుకొంటున్న పిల్లల బాధ్యతలు తీసుకుంటామన్న గొప్ప నాయకుడు. ఆయన చేస్తున్న సాయానికి ఈ రాష్ట్రంలో రైతులంతా పవన్ కల్యాణ్ ని రైతు మిత్రుడు అంటున్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయని జగన్ రెడ్డిని రైతు వంచకుడు అంటున్నారు. దీని మీద వైసీపీ నాయకులు ఎందుకు స్పందించరు? దమ్ముంటే దీని మీద మాట్లాడండి.

మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు కార్డుల పరిమితి 11 నెలలకు పరిమితం చేసింది వాస్తవం కాదా? ఎక్కడైనా కౌలు శిస్తు తగ్గించారా? ఇన్ పుట్ సబ్సిడి ఇచ్చారా? డీజిల్ ధరలు, ట్రాక్టర్ల అద్దెలు పెరిగిపోయాయి. రైతులకు డీజిల్ మీద ఒక్క రూపాయి సబ్సిడి ఇచ్చారా? ఎక్కడైనా రుణమాఫీ చేశారా? వడ్డీ మాఫీ చేశారా? వ్యవసాయ యంత్రాల ధరలు పెరిగిపోయాయి. ట్రాక్టర్లు గాని, వ్యవసాయ సామాగ్రి గాని మీ ప్రభుత్వం ఒక్క రైతుకు అయినా ఉచితంగా ఇచ్చిందా? ఈ రాష్ట్రంలో రైతాంగానికి వైసీపీ ప్రభుత్వం చేసిన మేలు ఒక్కటైనా ఉంటే చెప్పండి.

• కృష్ణా, గోదావరి అంటే అమ్మాయిల పేర్లు కాదు రాంబాబు
పవన్ కళ్యాణ్ కౌలు రైతుల కష్టాల గురించి మాట్లాడితే ఈ పనికి మాలిన మంత్రులు ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. జలవనరుల శాఖ మంత్రి జలవనరుల శాఖ అంటే స్విమింగ్ పూల్ శాఖ అనుకుంటున్నారు. అంబటి రాంబాబుకి పోలవరం ఎక్కడో, పులిచింతల ఎక్కడో తెలియట్లేదు. కృష్ణా, గోదావరి అంటే అమ్మాయిల పేర్లు అనుకుంటున్నారు. అవి అమ్మాయిల పేర్లు కాదు.. అవి నదులు. సంజన, సుకన్య కాదు. దయచేసి ఆ పేర్ల నుంచి బయటకు రావాలి. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని మీకు నీటిపారుదల మంత్రిత్వ శాఖ ఇవ్వడం ఏంటి? సంజనా-సుకన్య ప్రాజెక్ట్ అంటే అరగంటలో పూర్తి చేస్తాడేమో పవన్ కళ్యాణ్ ని తిట్టడం కోసం పెట్టారా? నీటిపారుదల శాఖ కోసం పెట్టారో చెప్పాలి. ఈయన గారు మళ్లీ సినిమాలు తీస్తారంట? తియ్యండి సీబీఐ దత్తపుత్రుడు.. బాత్రూమ్ లో బాబాయ్.. సంజనా సౌఖ్యమా.. మీరు ఇటువంటి సినిమాలు తీస్తే సూపర్ హిట్ అవుతాయి. నిర్మాత దొరక్కపోతే మేమంతా చందాలు వేసుకుని ఇస్తాం. మీ వాళ్లు బ్లాక్ టిక్కెట్లు అమ్ముకోవడానికి బాగా పనికొస్తాయి.

పవన్ కళ్యాణ్ గారికి కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మీ పనికి మాలిన మాటలు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోండి. పవన్ కళ్యాణ్ సమస్యల మీద మాట్లాడిన ప్రతిసారి ఆయనకు ఒక సామాజికవర్గాన్ని అంటగట్టే మాటలు మాట్లాడడం దుర్మార్గం. అలా మాట్లాడితే మీ మూతి పళ్లు ఊడతాయి. దామోదరం సంజీవయ్య గారి పేరు ఒక జిల్లాకు పెట్టమన్నప్పుడు, ఆవిర్భావ సభ వేదికకు ఆయన పేరు పెట్టినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ని దళిత పక్షపాతి అని ఎందుకు అనలేకపోయారు? జనసేన పార్టీ అన్ని వర్గాలకు చెందిన పార్టీ. ఒక కొత్త నాయకత్వానికి, కొత్త తరానికి అవకాశం ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ సొంతం.

• సీబీఐ దత్తపుత్రుడు అనడానికి ఆధారాలు ఉన్నాయి
మీ నాయకుడిని సిబిఐ దత్తపుత్రుడు అని చెప్పడానికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీ నాయకుడి మీద 13 సిబిఐ కేసులు, మూడు ఈడీ కేసులు ఉన్నది వాస్తవం కాదా? 420 సెక్షన్ కేసులు ఉన్నది వాస్తవం కాదా? జైలుకు వెళ్లిన మాట వాస్తవం కాదా? జైల్లో షటిల్ ఆడుకున్న మాట వాస్తవం కాదా? ఇంత కన్నా సాక్ష్యాలు ఏం కావాలి? ఆయన వ్యక్తిగత స్వార్ధం కోసం పార్టీ పెట్టుకున్నారు. మీమీదున్నది దొంగ కేసులు అయితే 16 నెలలు జైల్లో ఎలా ఉంటారు? దీనికి సమాధానం చెప్పండి.

ఇప్పుడు కొత్తగా సాక్షి పేపర్లో కౌలు రైతులకు డబ్బులు ఇఛ్చామని చెబుతున్నారు. అంటే కౌలు రైతుల మరణాలు ఉన్నాయని ఒప్పుకున్నట్టే కదా? కౌలు రైతుల ఆత్మహత్యలు జరగబట్టే పవన్ కళ్యాణ్ యాత్ర చేపట్టి వారికి సాయం అందిస్తున్నారని ఒప్పుకున్నట్టేగా? సాక్షి పేపర్లో అదే వేస్తున్నారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి.

టీడీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న వారికి కూడా పరిహారం ఇస్తున్నామని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ లా మీ సొంత డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? మీరిస్తుంది ప్రజల సొమ్ము. ప్రజలు పన్నులు కట్టిన సొమ్ము. అవాస్తవాలు ప్రచారం చేస్తే ఊరుకోం.

పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చమని మాట్లాడిన ఒక్క మాటకే మీకు అధికారం పోయినంత భయం వచ్చేసింది. అందుకే ఫ్యాంట్లు తడుపుకుంటున్నారు. రాజకీయాల్లో పొత్తులు, ఎత్తులు ఎన్నికల సమయంలో మా అధ్యక్షులు నిర్ణయిస్తారు? మేం ఎలా పోటీ చేయాలో కూడా మీరే చెబుతారా? మీకు దమ్ముంటే రాష్ట్రంలో సాగుతున్న విధ్వంసకర పాలన గురించి మాట్లాడిండి. రాష్ట్రానికి రాజధాని లేదు. ప్రత్యేక హోదా వస్తుందో రాదో తెలియదు. విభజన హామీల ఏమయ్యాయో తెలియదు.

మహిళల మీద మానభంగాలు జరిగితే శిక్షలు వేయలేని ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుందా? పవన్ కళ్యాణ్ మాటలతో వారి ప్రభుత్వం రాదని అర్ధం అయ్యే ఇలా అవాకులు పేలుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తెలంగాణకు తాకట్టు పెట్టిన జగన్ రెడ్డికి.. పక్క రాష్ట్రాలకు పెట్టుబడులు తరలిపోతుంటే చోద్యం చూస్తున్న ముఖ్యమంత్రి ప్రజల దృ సమాధానం చెప్పాలా? పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలివెళ్లిపోతుంటే సమాధానం చెప్పాలా? ప్రజల దృష్టిని మరల్చేందుకే పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేస్తున్నారు” అన్నారు.

Leave a Reply