– ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయానికి మధ్దతుగా ర్యాలీలు,పాలాభిషేకాలు,కొవ్వొత్తుల ర్యాలీలు
ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలలు సాకారమైన వేళ.పరిపాలనా వికేంద్రీకరణ,ప్రజలకు సౌలభ్యం,సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ నూతన జిల్లాల ఏర్పాటు చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.ముఖ్యంగాస్దానిక ప్రాధాన్యాన్ని,చారిత్రక నేపధ్యం,స్దానిక పరిస్ధితులను పరిగణనలోనికి తీసుకుని నూతన జిల్లాల ఏర్పాటులో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అయింది.
ఆయా జిల్లాల్లో మేధావులు,ప్రజలు,పార్టీల కతీతంగా రాజకీయనేతలు జగన్ నిర్ణయం పట్ల మధ్దతు పలుకుతూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ ఆనందాన్ని, సంతోషాలను వ్యక్తం చేశారు.భారీ ర్యాలీలు,మోటార్ బైక్ ర్యాలీలు,ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి,డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.పలు చోట్ల వారి చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు.గుంటూరు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించగా కోనసీమలో వినూత్నంగా కొబ్బరినీళ్లతో జగన్ చిత్రపటానికి అభిషేకం చేశారు.కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై ఎన్టీఆర్ అభిమానులు తమ ఆనందం వ్యక్తం చేశారు.అదే విధంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుపేరుతో ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయడం,కోనసీమ జిల్లా ఏర్పాటు,పుట్టపర్తి ప్రాధాన్యతను గుర్తిస్తూ సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయడం,పల్నాడు ప్రత్యేకతను నిలబెడుతూ పల్నాడు జిల్లాను ఏర్పాటుచేయడం వంటివి ప్రజల సంతోషానికి కారణమైంది.
జిల్లా ప్రజల, ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు అభీష్టం మేరకు శ్రీకాకుళం జిల్లాను కొనసాగించడం పట్ల ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం టౌన్ హాల్ నుంచి జి.టీ రోడ్ మీదుగా వైస్సార్ సర్కిల్ వరుకు వైస్సార్సీపీ కార్యకర్తలు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
విజయనగరం జిల్లాకు సంబంధించి పార్వతీపురంను జిల్లా కేంద్రంగా నూతన జిల్లాను ప్రకటించినందుకు సీఎం జగన్ గారికి ధన్యవాదములు తెలుపుతూ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనకాపల్లి రామచంద్ర థియేటర్ జుంక్షన్లో అనకాపల్లిని జిల్లాగా ప్రకటించినందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ మందపాడు జానకి రామ రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు ధాంక్యూ సిఎం సార్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.తూర్పుగోదావరి జిల్లా లో కోనసీమను జిల్లాగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ రావులపాలెంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆద్వర్యంలో ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసి ఎన్నికల హామీల్లో భాగంగా కొనసీమను జిల్లాగా ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నూతన జిల్లాల ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తూ పట్టణ వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు.అంబేద్కర్ , దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
కృష్ణాజిల్లా విజయవాడలో తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది.ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.పెడనలో ఎంఎల్ఏ జోగి రమేష్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
గుంటూరు జిల్లాకు సంబంధించి పల్నాడు జిల్లా ఏర్పాటు నేపధ్యంలో వినుకొండలో ఎంఎల్ఏ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.ర్యాలీ నిర్వహించారు.నరసరావుపేట ఎంఎల్ ఏ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు.గుంటూరు నగరంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, ఎంఎల్ ఏ మద్దాళి గిరి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో నగరమేయర్ కావటి మనోహర్ నాయుడు,మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఏసురత్నం పాల్గొన్నారు.ప్రభుత్వం రాష్ట్రంలోని 13జిల్లాలను 26 జిల్లాలుగా ప్రకటించడాన్ని హర్షిస్తూ ప్రకాశం జిల్లా చీరాల లో వైసిపి నేత కరణం వెంకటేష్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలతో ఘననివాళ్ళుర్పించారు.అనంతరం సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
కడప నగరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావ యాత్ర నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ నేతలు స్వాగతించారు.కడప నగరంలోని రోడ్స్ సెంటర్ నుంచి హెడ్ పోస్ట్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి,రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ కరీముల్లా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
26 జిల్లాల ఏర్పాటుకు సంఘీభావంగా థాంక్యూ సీఎం కార్యక్రమం కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఎంఎల్ఏ కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.బనగానపల్లె పట్టణం పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి పెట్రోల్ బంక్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు చల్లా భగీరథ రెడ్డి పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు లో జిల్లాల పునర్విభజనను స్వాగతిస్తూ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.జిల్లాల పునర్విభజనను స్వాగతిస్తూ బుచ్చిలో సంబరాలు జరుపుకున్నారు.ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ,సీఎం వైఎస్ జగన్ ,దివంగత నేత వైఎస్సార్ కట్ అవుట్ లకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేసారు.ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన సిఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసల జల్లులు కురిపించారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువులో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కృతజ్ఞత సభ నిర్వహించారు.పుట్టపర్తి ని జిల్లా గా ప్రకటించటం పై హర్షం వ్యక్తం చేశారు.సత్యసాయి జిల్లాగా నామకరణం చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేశారు.