– రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే బీ. ఆర్ ఎస్
– బిజేపి కుట్రలను తిప్పికొట్టాలి
– ప్రజా ప్రభుత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలనే బీ.ఆర్.ఎస్ బిజేపి కుట్రలను తిప్పికొట్టాలనీ మంత్రి తుమ్మల కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. శనివారం షేక్ పేట లో సీసీ రోడ్ ఓపెన్ జిమ్ ఇందిరాగాంధీ కమ్యూనిటీ హాల్ కు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తో కలసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల దశదిశ మార్చబోతుందని, రేవంత్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి బీ.ఆర్.ఎస్ బిజేపి జెండాలు పక్కన పెట్టీ రెండు పార్టీలు ఏకమై కాంగ్రెస్ పార్టీనీ ఓడించాలనీ పన్నే కుయుక్తులను ఓడించి ప్రజా ప్రభుత్వాన్ని జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలని మంత్రి తుమ్మల కోరారు.
అబివృద్ధి సంక్షేమ పథకాలతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చక్కని పాలన చేస్తుంటే రాజకీయ స్వార్థంతో బీ ఆర్ ఎస్…బిజేపి ఉప ఎన్నికల బరిలో ప్రలోబాలతో కులాల కుంపట్లు పెట్టీ గెలవాలనే కుట్రలను వివేకవంతమైన చైతన్యవంత మైన జూబ్లీ హిల్స్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీనీ గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని , జూబ్లీ హిల్స్ ఓటర్లు తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనుందని తెలిపారు.
కాంగ్రెస్ శ్రేణులు వర్గ విబేధాలు పక్కన పెట్టి పార్టీ గెలుపుకు కృషి చేయాలని,కష్టపడ్డ వారికి పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని మంత్రి తుమ్మల శ్రేణుల్లో జోష్ నింపారు.