– దివ్యాంగుల దినోత్సవంలో బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు
హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ప్రకారం డిసెంబర్ 3వ తేదీని ప్రపంచ దివ్యాంగుల దినంగా జరుపుకుంటున్నాం. నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014సంవత్సరం నుండి దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని గొప్పగా చేస్తున్నాం. దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందున్నారు. సామాన్యులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీపడుతున్నారు.
ఇటీవల పారా ఒలంపిక్స్ లో పాల్గొని సత్తా చాటారు. విద్యారంగం, వ్యాపార రంగాల్లో కూడా రాణిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు అనేక స్కీంలు ప్రకటించింది. ఆ పథకాల ద్వారా భారతదేశంలోని దివ్యాంగులకు లాభం జరుగుతోంది. దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తే మనందరితో కలిసి ముందుకువస్తారు.మోదీ నాయకత్వంలో దేశంలోని దివ్యాంగులకు న్యాయం జరుగుతోంది.