Suryaa.co.in

Telangana

మోసగాడి ప్రభుత్వం దివ్యాంగులను కూడా మోసం చేసింది

– దివ్యాంగులకు రూ.6,016 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదు
– ప్రభుత్వానికి దివ్యాంగులను ఆదుకోవాలనే సోయి లేదు
– దివ్యాంగుల దినోత్సవంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

హైదరాబాద్: దివ్యాంగులు ఎదురుకుంటున్న సమస్యలను నరేంద్రమోదీ నాయకత్వంలో విద్యారంగం, ఉద్యోగాలలో, రిజర్వేషన్లలో న్యాయం చేసేలా వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం గద్దెనెక్కిన మోసగాడి ప్రభుత్వం దివ్యాంగులను కూడా మోసం చేసింది.

సంవత్సరం గడిచినా దివ్యాంగులకు రూ.6,016 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదు. బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు. ప్రత్యేక కోటా కింద ఇండ్లు, లోన్లు ఇవ్వలేదు. సంవత్సర కాలంలో రూ.3లక్షల కోట్ల బడ్డెట్, రూ.80వేల కోట్ల అప్పు తెచ్చినా కళ్లు లేని ప్రభుత్వానికి దివ్యాంగులను ఆదుకోవాలనే సోయి లేదు.

ఏడాది పాలన విజయోత్సవాలపేరిట తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ ఉత్సవాలలో దివ్యాంగులకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున, దివ్యాంగుల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి ని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE