Suryaa.co.in

Andhra Pradesh

దొంగకేసుల నుంచి న్యాయమే మమ్మల్ని కాపాడుతుంది!

విజిల్ వేయడం, గంటకొట్టి నిరసన తెలపడం కూడా నేరమేనా?
నిరశనదీక్ష ముగింపు సందర్భంగా యువనేత నారా లోకేష్

న్యూఢిల్లీ: దొంగ కేసులనుంచి న్యాయం, చట్టాలే తమను కాపాడతాయని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా డిల్లీలో లోకేష్ చేపట్టిన నిరాహారదీక్షను ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ కుటుంబసభ్యులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.

అనంతరం లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ… మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా నమ్మిన సిద్ధాంతం కోసం జైలుకెళ్లారు, చంద్రబాబు గారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు తెచ్చినందుకే దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారు. చంద్రబాబునాయుడు ఆంధ్ర నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు తెచ్చి 2.15 మందికి శిక్షణ ఇచ్చి, 80వేలమందికి ఉద్యోగాలు కల్పించారు.

జవాబుదారితనంతో పనిచేయాలని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చంద్రబాబు చెప్పేవారు. చంద్రబాబు యుద్ధప్రాతిపదికను పనులు చేయడం వల్లే పెద్దఎత్తున నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చాయి. 45సంవత్సరాలు అహర్నిశలు పనిచేసి సైబరాబాద్ తోపాటు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను అభివృద్ధిచేశారు. ఏ తప్పు చేయని చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో తప్పుడు కేసుపెట్టి 24రోజులుగా చంద్రబాబును జైలులో పెట్టారు.

45సంవత్సరాలుగా తెలుగుప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేసినందుకే చంద్రబాబునాయుడుపై తప్పుడు కేసులు బనాయించారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా గత 24రోజులుగా ప్రజలు శాంతియుతంగా ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు, మోతమోగిద్దాం కార్యక్రమంలో పెద్దఎత్తున సామాన్యులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలిపారు. నిరసన తెలిపేందుకు విజిల్ వేసి, గంటకొడితే కేసు పెడతారా? అందుకే ఆయన పేరు మార్చాను. పిచ్చి జగన్ అని అంటున్నాను.

భువనేశ్వరమ్మ పొలిటికల్ యాక్షన్ కమిటీలో అక్టోబర్ 2న నిరాహారదీక్ష చేస్తామని చెప్పారు, ఆమెకు సంఘీభావంగా మేము కూడా దీక్షచేపట్టాం, దీక్షలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉంటే జడ్జి ముందు పెట్టాలి, ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబును జైలుకు పంపడమేగాక మరో 3కేసులు రెడీ చేశారు.

మంత్రులు రోజుకోసారి నన్ను, భువనేశ్వరమ్మను, బ్రాహ్మణిని జైలుకు పంపుతామని అంటున్నారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపే. అయినా మేము తగ్గేదేలేదు, పోరాటం కొనసాగిస్తాం. మాపై పెట్టిన తప్పుడు కేసులను ఆధారాలతో సహా అన్నీ ప్రజల ముందు ఉంచుతాం. రేపు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ విచారణకు వస్తుంది, కోర్టు నిర్ణయాన్ని బట్టి మా భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని యువనేత లోకేష్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE