Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుదేశం చేపట్టిన సత్యమేవ జయతే నిరాహారదీక్ష విజయవంతం

రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టిన టీడీపీ శ్రేణులు
దీక్షా కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ చేపట్టిన సత్యమేవజయతే నిరాహారదీక్ష కార్యక్రమంలో పెద్దఎత్తున నేతలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ చూపిన మార్గంలో ఈ సత్యాగ్రహ దీక్షలు చేపట్టడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్షా కార్యక్రమాలు కొనసాగాయి.
పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాజమండ్రి జైల్లోనే నిరాహార దీక్షకు దిగారు. రాజమండ్రి టీడీపీ క్యాంప్ ఆఫీస్ వద్ద నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీలోని ఎంపీ కనకమేడల ఇంట్లో నారా లోకేష్ నిరాహార దీక్ష చేశారు. – మంగళగిరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు నిరాహార దీక్షకు దిగారు.

హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‍లో సత్యమేవజయతే పేరిట ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, గారపాటి లోకేశ్వరి, తారకరత్న భార్య అలేఖ్య, కుమార్తె నిష్క, నారా రోహిత్ తల్లి ఇందిర, టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, అరవింద్ గౌడ్, ఇతర టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ సత్యాగహ్ర దీక్షలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడీయా కోఆర్డినేటర్ దారపనేని ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‍లో నిరాహారదీక్షకు వచ్చిన నందమూరి సుహాసినిని పోలీసులు అడ్డుకున్నారు.

కడప లో టిడిపి నాయకులు చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆర్.శ్రీనివాసరెడ్డి వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాజధాని గ్రామంలో రైతులు, రైతు కూలీల నిరాహార దీక్ష చేపట్టారు. బలిజ సంఘాల ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు మద్దతుగా కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు.

కొల్లిపర లో మాజీ మంత్రి ఆలపాటి రాజా దంపతుల నిరహార దీక్ష చేపట్టారు. దీక్ష కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, జూలకంటి బ్రహ్మారెడ్డి, పిల్లి మాణిక్యరావు పాల్గొన్నారు. మూల్పూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, పొన్నూరు లో మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో టీడీపీ ఇన్ చార్జ్ కోవెలమూడి రవీంద్ర, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టిడిపి ఇన్ చార్జ్ నసీర్ నిరహార దీక్ష చేపట్టారు.

రేపల్లె లో ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ సత్యమేవ జయతే పేరుతో నిరహార దీక్ష చేపట్టారు. గాంధీ వేషదారణలో చిన్నారులు పాల్గొని సంఘీభావం తెలిపారు. కొత్తూరు మండలం మధనాపురంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి, జనసేన ఆద్వర్యంలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలోకి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. వంశధార నదీ నీటిని మహిళలు బిందెలతో తెచ్చి శివునికి మహా కుంభాభిషేకం చేశారు.

మదనపల్లి మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ దొమ్మాలపాటి రమేష్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఒంగోలులో నిర్వహించిన సత్యమేవ జయతే దీక్షలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ జనసేన, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. కొండపిలో ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి దీక్షలో పాల్గొన్నారు. మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు పాల్గొన్నారు.

శృంగవరపు కోటలో నియోజకవర్గ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి నిరాహార దీక్ష చేపట్టారు. విజయవాడలో పార్లమెంట్ అధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షా కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురాం పాల్గొన్నారు. మడకశిరలో గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో సత్య మేయతే జయతే దీక్ష చేపట్టారు. కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు ఆద్వర్యంలో తెలుగు మహిళలు భారీ ఎత్తున రాజమండ్రికి తరలి వెళ్లడం జరిగింది.

అల్లూరి సీతారామరాజు వేషధారణలో పాలకొండ నియోజకవర్గ ఇంచార్జ్ నిమ్మక జయక్రిష్ణ నిరసన తెలిపారు. నరసరావుపేటలో టీడీపీ అభిమాని మందాడి రవి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నరసరావుపేట కోట సెంటర్ గాంధీ విగ్రహం నుంచి కోర్టు వరకు మోకాళ్లపై నడిచారు. పామర్రు నియోజకవర్గ ఇంఛార్జ్ వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాజమండ్రిలో నారా భువనేశ్వరి చేపట్టిన దీక్షకు మద్దతు తెలపడానికి ద్వారకా తిరుమల మండలం నుంచి మహిళా కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు.

గోపాలపురం నియోజకవర్గ ఇంఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు వినూత్నంగా నిరసన తెలిపారు. జైలులో కూర్చొని చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండించారు. నెల్లూరులోని సంతపేటలో ఆనం నివాసంలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ కి నిరసనగా బాబు కోసం మేము సైతం అంటూ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నాగులుప్పలపాడు మండలం చదలవాడలో మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ, సంతనూతలపాడు టీడీపీ ఇంచార్జ్ బి.ఎన్.విజయ్ కుమార్ సంఘీభావం తెలియజేశారు.

నిరసన దీక్షలలో పోలిట్ బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, బొండా ఉమామహేశ్వరరావు, పార్లమెంట్ అధ్యక్షులు కూనరవికుమార్, కిమిడి నాగార్జున, పల్లా శ్రీనివాసరావు, బుద్దా నాగజగధీశ్వరరావు, కె.ఎస్ జవహార్, తోట సీతారామలక్ష్మి, కనకళ్ళ నారాయణ, నెట్టెం రఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, జీవీ ఆంజనేయులు, నూకసాని బాలాజీ, అజీజ్, గొల్లా నరసింహాయాదవ్, జ్యోతుల నెహ్రు, కాలవ శ్రీనివాసులు, గన్నీ వీరాంజనేయులు, బి.కె పార్థసారథి, మల్లెల రాజశేఖర్ గౌడ్, పులివర్తి నాని, రెడ్డి అనంతకుమారి, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వేగుళ్ళ జోగేశ్వరరావు, బెందాళం అశోక్, ఆదిరెడ్డి భవాణి, గద్దెరామ్మోహన్ రావు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి, మంతెనరామరాజు, మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, గంటా శ్రీనివాసరావు, గొల్లపల్లి సూర్యరావు, గోరంట్ల బుచ్చియ్య చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మినారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పరిటాల సునీత, కె.ఈ కృష్ణమూర్తి నియోజకవర్గ ఇంఛార్జులు, రాష్ట్ర నాయకులు,మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE