– మాజీ ఐపీఎస్ అన్నామలై
రేపు ఉదయం నేను సర్వస్వం కోల్పోతే మా ఊరెళ్లి వేపచెట్టు కింద ప్రశాంతంగా నిద్రిస్తా..!నాకిరవై ఏళ్లు ఒచ్చే వరకు మాకు టాయిలెట్ కూడా లేదు. బయటకు వెళ్లే వాళ్లం. ఎప్పుడైనా వెనక్కెళ్లి సంతోషంగా పొలం పనులు చేసుకుని నా బతుకు నేను బతగ్గలను. ఎంతమంది రాజకీయ నాయకులిలా ధైర్యంగా చెప్పగలరు..?
ఇప్పటికిప్పుడు కూలిపని చేసి రోజుకు 300 రూపాయలు సంపాదించి బతగ్గలను. ఎంతమంది రాజకీయ నాయకులు ఇలా చేయగలరు..? అదే వారి భయం..! ఒక ఆశయం కోసం ఉన్నదంతా కోల్పోడానికి సిద్ధమయ్యే ఇక్కడికొచ్చా. ఎంతమంది రాజకీయ నాయకులు తమ రేంజ్‌రోవర్, లంబోర్గిని ఒదిలిపెట్టి.. చెప్పుల్లేకుండా పొలం పనులు చేయడానికి సిద్ధం..? నేను చేయగలను.
నేనొచ్చిన ఆశయం నెరవేరగానే.. సంతోషంగా మా ఊరెళ్లి పొలం పనులు చేసుకొంటా..! అధికారం కోసం పదవి కోసం ఇక్కడికొచ్చుంటే.. సమయమంతా పన్నాగాలు పన్నుతూ జాగ్రత్తగా ఉంటా. నాకిప్పుడు కోల్పోడానికేం లేదు. భయమూ లేదు. నామీద దాడి చెయ్యొచ్చు.. నన్ను వెటకారం చెయ్యొచ్చు.. బెదిరించొచ్చు.. కానీ నేను వీటన్నిటికీ భయపడే రకం కాదు. ఎందుకంటే.. నా పొలం, నా ఆవులు, చెట్లు నాకోసం మా ఊళ్ళో ఎదురుచూస్తున్నాయ్. నాకింతకంటే ఏం కావాలి..?రోడ్డు పక్కన నిద్రించడానికి సిద్ధమైనోడు ఎవరికీ భయపడక్కర్లేదని నా తాతయ్య చెప్పేవాడు. కానీ సుఖాలకు అలవాటు పడిన ఈ రాజకీయనేతలకు అది చేతకాదు. నేను అక్కణ్ణుంచి ఒచ్చినోణ్ణి.
ఏదో గత పదేళ్లుగా ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడింది. మధ్యతరగతి స్థాయికొచ్చి మంచి బట్టలు కట్టుకుని.. చెప్పులేసుకుని.. విమాన ప్రయాణం కూడా చేయగలుగుతున్నా. ఇవన్నీ జీవితం మనకిచ్చే కానుకలు. కానీ వీటిని జీవితం మళ్ళీ ఎప్పుడైనా లాగేసుకోవచ్చని నాకు తెలుసు. అందుకే ప్రజాజీవితంలో ధైర్యంగా ఉన్నా. జీవితంలో ఎంతో క్రింది స్థాయి నుండి పైకొచ్చా. కోయింబత్తూర్‌లో ఒచ్చిన ఉదోగావకాశాన్ని ఒదులుకుని.. ఐఐఎం కు ప్రిపేర్ అవుతుంటే.. నా తండ్రి ఇంటికి రాఒద్దన్నాడు. ఆ సమయంలో పస్తులుండి చదువుకున్నా. కొన్నిసార్లు మధ్యాహ్నం, రాత్రి కూడా పస్తులున్నా. ఇప్పుడదే కోయింబత్తూర్ నాకు మంచి పని చేసే అవకాశం ఇచ్చింది.
ఇప్పుడు మళ్ళీ నేనెక్కడి నుండి ఒచ్చానో అదే స్థాయికి వెళ్ళా. కోల్పోడానికేం లేదు. ఇక నాకు భయమెందుకు..? ఎప్పుడు కావాలంటే అప్పుడు నా గ్రామానికి పోతా.. సంతోషంగా పొలం పని చేసుకుంటా..!
దేశానికి కావాల్సింది ఇలాంటి నేతలు..! స్వలాభం.. ధనార్జన.. సొంత కుటుంబ అభివృద్ధి కోసం.. పదవీ అధికారం కోసం అర్రులు చాచే వాళ్లు కాదు.