– బాలయోగి ఆస్తులు కాజేసింది కేశినేని నాని
– దళిత వ్యక్తి ఆస్తులు కాజేసి ఏ మొహం పెట్టుకుని అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వెళ్ళావు నాని?
– లోకేష్ గెడ్డంలో నెరిసిన వెంట్రుక స్ధాయి కాదు కేశినేని నానిది.
– నీ బ్రతుకే అప్పులు ఎగ్గొట్టే బ్రతుకు
– ఉత్తరాంధ్ర టిడిపి ఇంచార్జ్ బుద్ధా వెంకన్న
విజయవాడ : కేశినేని నాని వైసీపీ కోర్టు కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నా. బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని. 2 వేల కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో కేశినేని నాని చెప్పగలడా? కేశినేని నాని అప్పులు ఎన్నున్నాయో చెప్పగలడా? కె అంటే కేశినేని కాదు… కోవర్టు
మొన్నటి వరకూ చంద్రబాబు అనుచరుడు కేశినేని నాని.. ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడుగా మారాడు. దొంగ రశీదు బుక్కులు తయారు చేయించి ఫైనాన్స్ కంపెనీకి కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన కోవర్టు నాని. వంద రూపాయల బస్సు టికెట్టు 500 కు అమ్మాడు కోవర్టు నాని. ఒకే నంబరు ప్లేటు మీద బస్సులు తిప్పిన కోవర్టు నాని.
భూకబ్జాలకు విజయవాడ నగరంలో పేటెంట్ రైట్ ఉన్న వ్యక్తి కోవర్టు నాని. చంద్రబాబు కేశినేని నానిని మెడబట్టి గెంటాడు అనేది నిజం. బాలయోగి ఆస్తులు కాజేసింది కేశినేని నాని అని చిన్న పిల్లాడిని అడిగినా చెపుతాడు. దళిత వ్యక్తి ఆస్తులు కాజేసి ఏ మొహం పెట్టుకుని అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వెళ్ళావు నాని?
బాలయొగి ఆస్తులు ఇచ్చేసి అంబేద్కర్ విగ్రహం కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. కేశినేని నాని ఊహల్లో బ్రతికే వ్యక్తి కనుకనే చంద్రబాబు స్ధాయి అని చెప్పుకుంటాడు. లోకేష్ గెడ్డంలో నెరిసిన వెంట్రుక స్ధాయి కాదు కేశినేని నానిది.
కేశినేని నాని వెనుక నందిగామలో పదిమంది లేరు. కేశినేని నాని టిడిపి వీడితే పది మంది లేరు అతని వెనుక. ఎన్నికల తరువాత వైసీపీ కేశినేని నాని సహా ఖాళీ అయిపొతుంది. ఉల్లిపాయ బాంబులు పేలితే పారిపోయే వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కాల్ మనీ అంటావు.. అంటే ఏంటో చెప్పు.. చర్చిద్దాం. నీ బ్రతుకే అప్పులు ఎగ్గొట్టే బ్రతుకు.
చంద్రబాబు ఈ జిల్లాలో చేసిన పోరపాటు ఈ కోవర్టును ఎంపీ చేయడం. చంద్రబాబు అమాయకత్వం, మంచితనంతో వదిలేసాడు.. జగన్ అయితే నాని ని కొట్టి పంపిస్తాడు. దాదాపు 9 కోట్ల రూపాయల చందాలు 2019లో వసూలు చేసాడు కేశినేని నాని. ఎన్ని రకాల అవలక్షణాలు ఉంటే.. అన్నీ ఉన్న వ్యక్తి కేశినేని నాని. కేశినేని నాని కొవ్వు కరిగిస్తాం
లోకేష్, చంద్రబాబు లను మర్యాదపూర్వకంగా కలిసాను. వెస్ట్ ఇంఛార్జ్ నేనేమీ అడగలేదు. కోఆర్డినేటర్ కూడా బ్లాక్ మెయిల్ చేసి తెచ్చుకున్నాడు కేశినేని నాని. చంద్రబాబు కుటుంబానికి విధేయుడుగా ఉంటాను. చంద్రబాబు కుటుంబానికి మా కుటుంబం అంకితం. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకి తెరపడింది. అన్న వదిలిన బాణం షర్మిల… ఇప్పుడు రివర్స్ అయింది.