Suryaa.co.in

Andhra Pradesh

ప్రతీ ఇంటా “మా నమ్మకం నువ్వే జగన్”

గృహ సార‌ధుల శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి

నెల్లూరు: ప్ర‌తీ ఇంటా మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్ అని ప్ర‌జ‌లు నిన‌దిస్తున్నార‌ని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండల కేంద్రంలోని శిడ్స్ కళ్యాణ మండపంలో నిర్వహించిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్థన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గృహ సార‌ధులు, స‌చివాల‌య క‌న్వీన‌ర్ల‌కు మంత్రి దిశానిర్దేశం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. “మా నమ్మకం… నువ్వే జగన్” కార్యక్రమంలో భాగంగా నూతనంగా తయారుచేసిన కరపత్రాల్లో ఉన్న విషయాలను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్ల‌డించారు.

LEAVE A RESPONSE