-మునిమనుమలకూ లాభం చేకూర్చే కరెంటు వాటా
-కాళేశ్వరం ప్రాజెక్టులో విపక్ష నేతల కంపెనీలకూ పనులు
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కమీషన్స్ గురించే అందరి ఆలోచన. నేను ఇంతవరకు ఎక్కడ చర్చించని విషయాన్నీ తెలంగాణ ప్రజల దృష్టికి నా కోణంలో వివరిస్తాను..ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎందరో సీనియర్ ఇంజనీర్స్ మేధావులు రాజకీయ విశ్లేషకులు వివరించని అంశాన్ని వివరిస్తాను..
కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైనింగ్ లో మార్పులు ఎందుకు చేశారు?
కెసిఆర్ దూర దృష్టిని గ్రహించాలి.. ఇక్కడ నీళ్లు ఎత్తిపోయడమనేది.. చాలా ఖర్చుతో కూడుకున్నది..
కరెంటు వినియోగంతో కూడుకున్నది..
కానీ దీనిని అమలు చేయడంలో కెసిఆర్ అంతరంగిక ఆలోచన వేరు.
దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి ఈ ప్రాజెక్ట్ పూర్తి అయింది…
కెసిఆర్ అంతరంగిక ఆలోచన ఇక్కడ నేనూ వివరిస్తాను.. కరెంటు వినియోగంతో ఎత్తిపోతలు నిర్వహిస్తారు కదా? ఆ కరెంటు బిల్ సంవత్సరానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు మీద 8000కోట్ల నుండి 12000 ల కోట్ల రూపాయలు వస్తే, 20లక్షల ఎకరాలు సాగు అవుతవి.
ఇక్కడ 12000 కోట్ల కరెంట్ బిల్ లో (కెసిఆర్ వాటా (కమిషన్ ఊహించుకోండి) దీర్ఘ కాలం సీఎం అయినా కాకపోయినా)ముని మనవళ్ల వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే కరెంటు సప్లై చేసే సంస్థల కాంట్రాక్టు , ఒక 100 సంవత్సరాలకు తక్కువ కాకుండా ఉంటుంది..
తెలంగాణ లో కొంత మంది ప్రతిపక్ష నాయకులకు కూడా కరెంటు ఉత్తత్తి చేసే పరిశ్రమలు ఉన్నవి. వారు కూడా గుడ్డి కన్నా మెల్ల నయం అనే రీతిలో కాళేశ్వరంకు కరెంటు సప్లై చేసి దాని బిల్ లో భాగస్వామ్యం అయి లాభాలు పొందుతున్నారు…
కాగ్ నివేదిక ప్రకారం ఒక ఎకరానికి కరెంటు బిల్ తో సహా ఇతర వినియోగాల కోసం
ఒక లక్ష రూపాయలు నెలవారి ఖర్చు..
మన ఓట్లతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యక్తులే, దోపిడీ వర్గాలు అనే నిజాన్ని మనం గుర్తించలేకపోవటం శోచనీయం. ఈ దోపిడీ వర్గాలు భవిష్యత్తులో బహిరంగంగానే మన అవయవాలను విక్రయించే పరిస్థితిని కలిపించి చట్టబద్ధం చేస్తాయి.
మనలో ఓటు చైతన్యం రాకపోతే..
భవిష్యత్ లో ఈ దేశంలో నీకు అమ్ముకోవడానికి ఏమి మిగలక, నీ దేహంలోని అవయవాలను అమ్ముకోవడమే అంతిమ పరిష్కారం.
కెసిఆర్ ఆలోచన ముని మనవళ్లకు ఫలాలు అందిస్తే, మన ఆలోచనలు మన పిల్లల భవిష్యత్తు తాకట్టు పెట్టే విధంగా ఉన్నవి..
నేను ఇంతకన్నా ఎక్కువ వివరించలేను.
చెన్న శ్రీకాంత్
బీసీ