– తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందించిన ఎన్టీఆర్ కుమార్తె మరణంపై శవ రాజకీయమా?
– నందమూరి, నారా కుటుంబలపై బురద చల్లుతుంటే ఇక చూస్తూ ఊరుకోం
– తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మూల్పూరి సాయి కల్యాణి
గన్నవరం: ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్యపై విజయసాయిరెడ్డి, లక్ష్మీపార్వతి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మూల్పూరి సాయి కల్యాణి తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్బంగా గురువారం నాడు ఒక పత్రిక ప్రకటన విడుదల చేసారు.
సాయి కల్యాణి మాట్లాడుతూ.. ఉమామహేశ్వరి మృతిపై వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, లక్ష్మీపార్వతి, దేవేందర్ రెడ్డి రాజకీయం చేయడం అత్యంత నీచమని పేర్కొన్నారు. అలాగే శవ రాజకీయాలకు వైస్సార్సీపీకి పెట్టిందిపేరని ఎద్దేవా చేశారు.ప్రపంచ పటంలో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలపెట్టిన అన్న ఎన్టీఆర్ కుమార్తె మరణిస్తే, దాన్ని కూడా శవ రాజకీయాలు చేయడం అనేది సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నందమూరి, నారా కుటుంబలపై బురద చల్లుతుంటే ఇక చూస్తూ ఊరుకోం తగిన రీతిలో బుద్ధి చెబుతాం అని హెచ్చరించారు. ఎన్టీఆర్ కుటుంభంలోకి లక్ష్మీపార్వతి వచ్చాకే శని పట్టుకుందని, లేదంటే నేటికి ఎన్టీఆర్ బ్రతికే ఉండేవారని ఆమె అన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలను కప్పిపుచ్చేందుకే వైసీపీ ఈ తరహా అబద్దపు ప్రచారానికి తెరలేపిందన్నారు.
ఉమామహేశ్వరీ మృతిపై, టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి, లక్ష్మీపార్వతి, దేవేందర్‌రెడ్డిని పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.