-ఆమెపై గతంలోనూ పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు
-కార్యాలయంలో మరో మూడు అవినీతి చేపలు
-ప్రతి చిన్న పనికి పైసలు డిమాండ్
జిల్లాలోని కమలాపూర్ తహసీల్దారు మాధవి రైతు దగ్గర లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం కు చెందిన రైతు కసరబోయిన గోపాల్ దగ్గర విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం ఆమె రూ.30 వేలు డిమాండ్ చేసింది. రైతు ముందుగా రూ.5 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. సదరు అధికారిపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. విచారణ చెపడితే అనేక ఆసక్తికర అంశాలు బయటపడే అవకాశం ఉంది. అయితే తహసీల్దారును ఏసీపీ పట్టుకోవడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో మరో మూడు అవినీతి చేపలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ప్రతి చిన్న పనికి పైసలు డిమాండ్ చేస్తూ పీడిస్తున్నారని అంటున్నారు.