Suryaa.co.in

Andhra Pradesh

ఇదీ స్ట్రాంగ్‌రూమే..నట!

-పోస్టల్ బ్యాలెట్ పెట్టె లు ఇక్కడే భద్రపరుస్తారట
-భద్రతపై రాజకీయ పార్టీల సందేహాలు

బాపట్ల: కనిపిస్తున్న ఈ ‘చిత్రం’ చూశారా? ఇదేదో పాడుపడ్డ ఇల్లనుకుంటున్నారా? అలా అనుకుంటే కచ్చితంగా పప్పులో కాసినట్లే. ఎందుకంటే ఇది ఇదీ స్ట్రాంగ్‌రూమే నట! టార్పాలిన్‌ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలెట్ పెట్టెలు ,టార్పాలిన్‌ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలట్‌ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌.

బాపట్ల తహసీల్దారు కార్యాలయంలోని ఈ గదిని గతంలో వీఆర్వోలు ఉపయోగించుకునేవారు. వర్షాలు పడే సమయంలో పైకప్పు నుంచి నీరుకారుతుండటంతో కొంతకాలంగా సిబ్బంది ఎవరూ దీనిలో ఉండట్లేదు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఈ గదిలోనే ప్రస్తుతం పోస్టల్‌ బ్యాలట్‌ బాక్సులు ఉంచడంతో వాటి భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి గదిలో పోస్టల్‌ బ్యాలట్‌ బాక్సులను ఉంచడంపై రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కీలకమైన పోస్టల్ బ్యాలెట్ పెట్టెల భద్రత ఇంత బలహీనంగా ఉంటే ఎలా? అని అటు ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతున్నారట.

LEAVE A RESPONSE