వేల ఎకరాలు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఉచితంగా ఇచ్చి కూడా తన ఉదారతని సమాజానికి చెప్పుకోడంలో కమ్మ ఎందుకో వెనకబడ్డాడు.
అనేక ప్రాంతాల్లో వందల సంఖ్యలో స్కూళ్ళు, కాలేజీలకు భూములు, డబ్బు విరాళంగా ఇచ్చి కూడా తమ ఔదార్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కమ్మ ఎందుకో వెనకబడ్డాడు.
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తయారుచేసి కోట్లాది ప్రాణాలు కాపాడి కూడా తమ ఘనతని చాటుకోడంలో కమ్మ ఎందుకో వెనకబడ్డాడు.
వివిధ రంగాల్లో వ్యాపారాలు చేస్తూ లక్షలాది కుటుంబాలకి ఉపాధి కల్పిస్తూ కూడా సమాజానికి తాము చేస్తున్న మేలుని చెప్పుకోడంలో కమ్మ ఎందుకో వెనకబడ్డాడు.
దాదాపు అన్ని దేశాల్లోనూ స్థిరపడి తెలుగువారి సామర్ధ్యాన్ని , భారతీయుల ప్రతిభా పాటవాలని ప్రపంచానికి తెలియజేస్తూ కూడా తమ శక్తిని చాటుకోడంలో కమ్మ ఎందుకో వెనకబడ్డాడు.
చెన్నై , సైబరాబాద్ లాంటి గొప్ప నగరాలని నిర్మించి కూడా ఆధునిక భారత దేశపు నిర్మాణంలో తమ పాత్ర గురించి ఈ తరం యువతకి వివరించడంలో కమ్మ ఎందుకో వెనకబడ్డాడు.
ఆత్మగౌరవ నినాదంతో ఢిల్లీ పీఠాన్ని వణికించి కూడా తమ కులం ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్న మూర్ఖులను నియంత్రించడంలో కమ్మ ఎందుకో వెనకబడ్డాడు.
అన్ని కులాలూ సమానమే అని చాటి చెప్పడానికి చాప కూటి సిద్ధాంతాన్ని (అన్ని కులాల వారూ కలిసి భోజనం చేయడం) ప్రవేశపెట్టి కూడా కులగజ్జి కలవారంటూ తమ మీద జరుగుతున్న విష ప్రచారాన్ని అడ్డుకోడంలో కమ్మ ఎందుకో వెనకబడ్డాడు.
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ , తెలంగాణ సాయుధ పోరాటంలోనూ మహోన్నత పాత్ర పోషించి కూడా ఆ చరిత్రకు సరైన గుర్తింపు తెచ్చుకోవడంలో కమ్మ ఎందుకో వెనకబడ్డాడు.
ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం కలలు గని, అందుకోసం అహిర్నిశలూ కృషి చేసి కూడా తమ ఆలోచన కార్యరూపం దాలిస్తే లబ్ది పొందేది ఒక్క తమ కులం మాత్రమే కాదు అన్ని కులాల వారికీ బంగారు భవిష్యత్తు ఉంటుందని వివరించడంలో కమ్మ ఎందుకో వెనకబడ్డాడు.
కమ్మ ఇలా వెనకబడిపోదానికి కారణం.. సమాజానికి తాము వెన్నెముకగా ఉండడం . వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం.
ఇదేనేమో కమ్మ వెనకబడ్డానికి కారణం
(తనికెళ్ళ భరణి గారి రచన ” నాన్న ఎందుకో వెనకబడ్డాడు” స్పూర్తితో ….)
– ప్రవీణ్ ఉప్పలపాటి