Suryaa.co.in

Andhra Pradesh

ఐఏఎస్ లో 37వ ర్యాంకు సాధించిన కందుకూరు యువతి

కందుకూరు పట్టణానికి చెందిన ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ మన్యం సుబ్బారావు కోడలు సంజన సింహ ఐఏఎస్ పోటీ పరీక్షలో 37వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు. ఆమె మాట్లాడుతూ 37 వ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ర్యాంక్ సాధించడానికి తనతో పాటు కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందించారని అందువలన ఇది సాధ్య పడిందని తెలిపారు. నీతి నిజాయితీగా పనిచేసి కందుకూరు పట్టణానికి, తమ కుటుంబ సభ్యులకు మంచి పేరు తీసుకువస్తానని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE