Suryaa.co.in

Andhra Pradesh

అమ్మవారి కల్యాణ మహోత్సవంలో కన్నా లక్ష్మి నారాయణ

నరసరావుపేట రోడ్ లోని శ్రీలక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం నందు అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా కన్నా లక్ష్మి నారాయణ పాల్గొని, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పూజారులు వేదమంత్రాల తో ఆశీర్వదించి, అమ్మవారి వస్త్రం బహుకరించారు. తర్వాత అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టి భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాలో ఉన్న నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు,పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE