Suryaa.co.in

Andhra Pradesh

పాదయాత్ర ముగింపు తేది గుర్తుంది కానీ ఇచ్చిన హామీలు గుర్తు లేవు

పెట్రోల్ డీజిల్ ధరలపై వైసీపీ ప్రభుత్వం వ్యాట్ తగ్గించక పోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదురు ధర్నా. అనంతరం జాయింట్ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు…
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 5 రూపాయలు డీజిల్ పై 10 రూపాయలు తగ్గించింది. ఆర్థిక వ్యవస్థకు మరింత ఊరటనిచ్చేందుకు డీజిల్ మరియు పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించిన ప్రధానమంత్రి నరేంద్రమోది ధన్యవాదాలు. రాష్ట్రంలో పెట్రోల్, డిజీల్ పై వ్యాట్, సెస్ తగ్గించాలి. పాదయాత్రలో సెస్ ట్యాక్స్ లు తగ్గిస్తామని జగన్ హామీ ఇచ్చారు. పాదయాత్ర ముగింపు తేది గుర్తుంది కానీ పాదయాత్రలో ఇచ్చిన హామీలు గుర్తు లేవు. కేంద్రం తగ్గించిన పన్నులు మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని మోడీ చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్, సెస్ తగ్గించలేదు. పన్నులు తగ్గించే వరకూ ఆందోళన కొనసాగిస్తాం. అంతర్జాతీయ దరలకు అనుగుణంగా ధరలు మార్చుకోవచ్చని యుపిఏ నిర్ణయం తీసుకుంది.
జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. కరోనాకు దెబ్బతిన్న ఆర్థిక వ్యవ్యస్థను కాపాడుకుంటూ, 100 కోట్లకు పైగా కరోనా టీకాలను ఉచితంగా అందచేసి, కష్టమైన కూడా డీజిల్ మరియు పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించి సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ డీజిల్ పై ఎక్సైజ్ సుంకంను భారీగా తగ్గించడం ద్వారా రైతులకు రాబోయే రబీ సీజన్లో మరింత ప్రోత్సాహన్నిస్తుంది. వైసీపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఇతర రాష్ట్రాల మాదిరిగా తగ్గించకుంటే మరింత ఉద్యమిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం టాక్స్ లు వేయడమే పనిగా పెట్టుకుంది.
ఈ ధర్నా కార్యక్రమంలో మాజీమంత్రి కోస్తాంధ్ర డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్ శనక్కాయల అరుణ, కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ ఎస్సీమోర్చా ఇంచార్జి వల్లూరు జయప్రకాష్ నారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బిట్రా శివన్నారాయణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమ్మిశెట్టి ఆంజనేయులు, పొగతోట రమాకుమారి, మహిళామోర్చా రాష్ట్ర కార్యదర్శి యామిని శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాచుమల్లు భాస్కర్, అప్పీశెట్టిరంగా,కుమార్ గౌడ్, పాలపాటి రవికుమార్,కంతేటి బ్రహ్మయ్య, నీలం ప్రసాద్, వనమా నరేంద్ర, అనుమోలు ఏడుకొండలు గౌడ్,ఉయ్యాల శ్యాంవరప్రసాద్,భాష హరికృష్ణ,నమ్రత చౌదరి,ఏలూరి లక్ష్మీ, యశ్వంత్, కొక్కెర శ్రీనివాసరావు,ఆవుల రామకోటేశ్వరరావు, బుల్లిబాబు,పోతురాజు వెంకట్,కొర్రపాటి సురేష్,లలిత్ రాష్ట్ర మీడియా కోకన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు..

LEAVE A RESPONSE