Home » వెండి తెర మొండి నాగమ్మ!

వెండి తెర మొండి నాగమ్మ!

కన్నాంబ..
ఆమె సినిమాల ప్రస్తావనలో
మరీ వెనక్కి వెళ్ళే వయసు లేదు కాని..
అంటే మాయాలోకం..
మాయామశ్చీంద్ర…
గృహలక్ష్మి..
ఇలా..
అయితే తర్వాత
చూసిన కౌసల్య..
విన్న నాయకురాలు నాగమ్మ
ఎన్నో సినిమాల్లో
ప్రేమ కురిపించే అమ్మ..
అబ్బో..ఏం రూపం..
అదెంత అభినయం..

అంతపురాన్ని పాలించే
అత్తలం ముగ్గురం ఉండగా..
అంటూ సీతను వనవాసానికి
పంపిన రామయ్యపై
అమ్మ ఆగ్రహం..
చూసే మనకే గగుర్పాటు..
సుతునికి రాదా తడబాటు..!
నటన కాదేమో..
దశరథ పట్టమహిషి
అలాగే ఉండేదేమో!?

చదువు రాని వాడని
దిగులు చెందే
*ఆత్మబంధువు* కు
అన్నీ తానే అయిన
రాణి మనసు వెన్న..
కొడుకులతో పాటు కుక్కకూ
ప్రేమ అనే పాలు పోసి
పెంచిన తల్లి..
అంతకు ముందు
గోవిందరాజుల సుబ్బారావుతో పోటీగా
*నాయకురాలు నాగమ్మ*
*పల్నాటి పౌరుషం..*
అదరగొట్టిన ఆమె వేషం
చూస్తుంటే ఉత్కంఠ కదా
ప్రతి నిమిషం!

శిలగా మారిన *జగదేకవీరుడు*
రాజమాత వేడుకోలు..
దివి నుంచి భువికి దిగిన జగదంబ…మన కన్నాంబ
అంతలోనే నడుము
వంగిన అవ్వ..
దృష్టి తీసేసాను..
సృష్టిలోకి రారా వత్సా
అంటూ మనిషైన
రాకుమారుని
పసిబిడ్డగా మార్చి…
ఇంద్రకుమారిని చేర్చి
చీరను కాలిలో దూర్చి
ఏం మాయ చేసిందో..
ఎంత బాగా నటించిందో!

కన్నాంబ అభినయం..
కన్నాంబ దానగుణం…
కన్నాంబ అమ్మతనం..
కన్నాంబ కంఠం..
ఇవన్నీ ఎందరో నటీమణులకు ఓ పాఠం!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply