ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ మరో కీలక పదవిని భర్తీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ పదవికి పార్టీ నేత కె.రవిచంద్రారెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకాన్ని చేపట్టినట్లు ఆ ప్రకటనలో వైసీపీ పేర్కొంది.
గతంలో నెల్లూరు జిల్లా, ప్రస్తుతం శ్రీ బాలాజీ తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గానికి చెందిన రవిచంద్రారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. పార్టీ తరఫున ఆయా మీడియా ఛానెళ్లు నిర్వహిస్తున్న డీబేట్లకు హాజరవుతున్న రవిచంద్రారెడ్డి పార్టీ వాణిని బలంగానే వినిపిస్తున్నారు. ఈ కారణంగానే ఆయనకు పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ పదవి దక్కినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే… తనపై నమ్మకం ఉంచి జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, పార్టీ కోసం శ్రమిస్తానని రవిచంద్రారెడ్డి తెలిపారు.
THANK YOU VERY MUCH C.M.SIR…SRI.YS JAGAN MOHAN REDDY GARU…I WILL GIVE MY HUNDRED PERCENT SIR…WITH ALL RESPECTS TO MY ELDERS I WILL TAKE BLESSINGS OF THEM…@YSRCParty @ysjagan @VSReddy_MP ..@SRKRSajjala … pic.twitter.com/PK6tmSxe3e
— K.RAVI CHANDRA REDDY (@SkymaxRavi) July 22, 2022