ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ డెస్టినేషన్ గా మారింది

– మంత్రి హరీశ్ రావు

ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ డెస్టినేషన్ గా మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలే దీనికి కారణమని చెప్పారు. ప్రపంచంలోని అతి పెద్ద బహుళజాతి సంస్థలు, ఐటీ సంస్థలు ఇక్కడ విస్తరణ కేంద్రాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ఆస్పైర్ పాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫీనిక్స్ టెక్నాలజీస్ ఇక్కడ ఆస్పైర్ సొల్యూషన్స్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని హరీశ్ అన్నారు. తెలుగు విద్యార్థులకు ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు. ఆవిష్కరణల విషయంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని నీతి ఆయోగ్ వెల్లడించిందని తెలిపారు. ఆవిష్కరణల సూచీలో కర్ణాటక, తెలంగాణ తొలి రెండు స్థానాల్లో ఉంటే… గుజరాత్, బీహార్ 14, 15 స్థానాల్లో ఉన్నాయని చెప్పారు.

Leave a Reply