తెలంగాణ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సనత్‌నర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కానూరి జయశ్రీ నియమితులయ్యారు. ఆ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆమెకు నియామకపత్రం అందించారు. రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ శ్రీపతి సతీష్, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు అశోక్, ఆర్గనైజింగ్ సెక్రటరి మండూరి సాంబశివరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏ.ఎస్.రావు, రాష్ట్ర నేత ప్రకాష్ ముదిరాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ, తన సేవలు గుర్తించి తనకు పదవి ఇచ్చిన కాసానికి కృతజ్ఞత తెలిపారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో మళ్లీ టీడీపీ జెండా ఎగిరేందుకు, శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు సహకరించిన పార్టీ నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని నియోజకవర్గ ప్రజలకు మరోసారి గుర్తు చేస్తానని చెప్పారు.