పాత్రికేయ భాషలో అయితే ‘దేశ మెజారిటీ ప్రజల మనోభావాలను కరణ్ థాపర్, సాక్షి దెబ్బతీస్తున్నాయి’ అనాలి.
సాక్షి సంపాదక మేధావి వర్ధెల్లి మురళి భాషలో అయితే ‘ఇది రాజ్యాంగంపై దాడే’ అని కూడా అనచ్చు. నేను ఆ స్థాయి సీనియర్ పాత్రికేయుణ్ణి కాను కనుక ఆ మాట అనడం లేదు.
‘దేశ వ్యతిరేక పాకిస్తానీ ఇస్లామ్ తొత్తు కరణ్ థాపర్’ అని నేను అనడం లేదు… కానీ ఈ మాటను మనం చాల కాలంగా వింటున్నాం!
సాక్షి ఎడిట్ పేజ్లో ‘మనసులను వేరు చేసి చూడలేం’ శీర్షికతో కరణ్ థాపర్ చేసిన పేలాపన మనం వింటున్న ‘దేశ వ్యతిరేక పాకిస్తానీ ఇస్లామ్ తొత్తు కరణ్ థాపర్’ అన్న మాటే నిజమే అని స్వయంగా కరణ్ థాపరే చెప్పుకున్నట్టు అనిపిస్తోంది.
క్రికెట్ మాచ్లో గెలిచిన మన దేశ క్రీడాకారులు ఓడిన పాక్ క్రీడాకారులతో కరచాలనం చెయ్యలేదని కరణ్ థాపర్ వాపోయాడు.
పెద్ద శాతం దేశ ప్రజలు మన క్రీడాకారులు చేసిన పనిని గట్టిగా సమర్థిస్తూ మెచ్చుకుంటుంటే కరణ్ థాపర్ దానికి విరుద్ధంగా రాయడం అతడి ఆంతర్యాన్ని గట్టిగా తెలియజేస్తోంది. కరణ్ థాపర్ ఏ పాకిస్తాన్ వేళ్లనో నోట్లో పెట్టుకుని చేసుకున్న వాంతి ఇది అని అనుకోవాల్సి వస్తోంది.
కరణ్ థాపర్ ఎందుకు దేశ ప్రజకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఇలా వాంతులు చేసూకుంటూనే ఉంటాడు? ఆ కరణ్ థాపర్ వాంతుల్ని దోసిళ్లతో పట్టి సాక్షి క్రమం తప్పకుండా ఎందుకు తెలుగు ప్రజలపై పోస్తోంది? సాక్షి కూడా మెజారిటీ దేశ ప్రజలకు వ్యతిరేకమేనా?
అసలు ఈ వ్యాసం పాత్రికేయం అవుతుందా? ఎడిట్ పేజ్ స్థాయి వ్యాసమా ఇది? ఈ వ్యాసంవల్ల తెలుగు పాఠకులకు అందుతున్న సందేశం ఏదైనా ఉందా? ప్రజా వ్యతిరేకతను వెళ్లగక్కుకోవడమే సాక్షి పాత్రికేయమా?
ఇటువంటి పనికిమాలిన, ప్రజా వ్యతిరేక వ్యాసాలను క్రమం తప్పకుండా ప్రచురిస్తూ, ప్రచురిస్తూ సాక్షి ఏ దేశ వ్యతిరేక విదేశీ మత మాఫియాల నుంచో, ఏ దేశ వ్యతిరేక ఎకో సిస్టమ్ నుంచో లోపాయకారీ లబ్ది పొందుతోందా? ప్రజల అభీష్టానికి, ప్రజలు మెచ్చిన వాటికి వ్యతిరేకంగా ఇటువంటి పేలాపనలు చేస్తోందంటే సాక్షి దేశ, దేశ ప్రజా వ్యతిరేక శక్తుల ప్రతినిధా? లేదా సాక్షి కూడా దేశ, దేశ ప్రజా వ్యతిరేక శక్తేనా? సాక్షికి దేశ, పెద్ద శాతం ప్రజల ఆలోచనలు, అవసరాలు, అభీష్టాలు ఎందుకు పట్టవు?
సరే ఏ కరణ్ థాపరో ఏ వాంతో చేసుకుంటాడు… ఆ వాంతిని సాక్షి సంపాదక వర్గం దోసిళ్లతో పట్టి తెలుగు ప్రజలపై పొయ్యడం ఏమిటి? తెలుగువాళ్లు బుద్ధి, స్పృహ లేనివాళ్లు అని సాక్షి సంపాదకవర్గం, యాజమాన్యం అనుకుంటున్నాయా?
సాక్షి సంపాదక వర్గానికి సరైన ‘చదువు’ లేదు అని నేను కొన్నేళ్లుగా సోదాహరణంగా ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నాను. సాక్షి సంపాదకీయాలు, ఇతర వ్యాసాలు ఏ మేరకు నాసిరకమైనవో మనం చూస్తునే ఉన్నాం. సాక్షి సంపాదక మేధకు సోషల్ మీడియా, ఇంటర్ నెట్, జాతీయ ప్రధాన మీడియా వంటివి ఉన్నాయన్న సంగతి ఎందుకు తెలియదు?
సోషల్ మీడియా, ఇంటర్ నెట్, జాతీయ ప్రధాన మీడిఅ ఇవి మన క్రికెట్ క్రీడాకారులు చేసిన దాన్ని పూర్తిగా సమర్థించాయి; హర్షించాయి అని సాక్షి సంపాదక వర్గానికి మాత్రం తెలియకపోవడం సిగ్గుచేటు. సాక్షి సంపాదక వర్గం ఏ లోకంలో బతుకుతోంది? సాక్షి సంపాదక వర్గంది ఏ మాలోకం?
తెలుగు పాఠకులను, హిందువులను తక్కువగా అంచనావేస్తోందా సాక్షి? తెలుగు పాఠకులను, హిందువులను తక్కువగా అంచనావేస్తూ ప్రజా వ్యతిరేక వ్యాసాలతో, ప్రజాభీష్టానికి వ్యతిరేకమైన పాత్రికేయం(?)తో తన ఎజెండాను అమలు చేస్తూ సాక్షి ఎక్కడి నుంచో ఏ లోపాయకారీ లబ్దినో పొందుతోందేమో అని అనుమానం, భయం కూడా కలుగుతున్నాయి.
నిన్న జరిగిన క్రికెట్ మాచ్లో గెలిచిన మన క్రీడాకారులు పాకిస్తాన్ వ్యక్తి ఎ.సి.సి. చీఫ్ మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోలేదు. ఇందుకు పెద్ద శాతం దేశ ప్రజలు హర్షాన్ని తెలియజేస్తున్నారు.
ఈ సంఘటననూ నిరసిస్తూ కరణ్ థాపర్ ఏ పాకిస్తాన్ వేళ్లనో నోట్లో పెట్టుకుని రేపో, ఎల్లుండో మరో వాంతి చేసుకుంటే ఆ వాంతినీ ఎడిట్ పేజ్లో ప్రధానాంశంగా వేసి సాక్షి తెలుగు పాఠకుల మనోభావాల్ని దెబ్బతీస్తుందా? ఆ పని చేసి సాక్షి తన ఉనికిని గట్టిగా చాటుకోనుందా?
సాక్షి పెద్ద శాతం తెలుగు పాఠకుల మనోభావాల్ని దెబ్బతీస్తూనే ఉంటుందా?

9444012279