సరిగ్గా 4 ముధోల్ హౌండ్స్ కలిస్తే ఒక పులిని కూడా వేటాడగలవు. ఇవి కర్ణాటకకు చెందిన వేట కుక్కలు. ప్రపంచంలోనే అతి గొప్ప హంటింగ్ డాగ్స్ లో ఇవి ఒకటి. వీటి వేగం ఏకంగా 50 కిలోమీటర్లు. పెద్ద పెద్ద ఫెన్సింగ్ లను కూడా అవలీలగా దూకగలవు. వాసన పసిగట్టడంతో, వీటి ముందు జర్మన్ షెప్పర్డ్ కూడా దిగదుడుపే. ఇప్పుడీ జాగీలాలు ప్రధాని మోది రక్షణ భాద్యతలను చూడనున్నాయి. మోదీజీని కంటికి రెప్పలా చూసే SPG స్క్వాడ్ లోకి ఇవి ప్రవేశించాయి. ఒక భారత దేశ ప్రధాని సెక్యూరిటిలో అవకాశం దక్కించుకున్న మొట్తమొదటి దేశీయ కుక్క మన ముధోల్ హౌండ్స్.