Suryaa.co.in

Telangana

కవిత ఓ ఫైటర్

-సిసోడియా కు బెయిల్ వస్తే బీజేపీ ఆప్ కుమ్మక్కయినట్టా?
-బీ ఆర్ ఎస్ కు బీ జే పి తో ఎలాంటి పొత్తు ఉండదు
– బీఆర్‌ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్

హైదరాబాద్: కవిత కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు కు ధన్యవాదాలు. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈడీ ,సిబిఐ ల దర్యాప్తు తీరు ను తీవ్రంగా ఆక్షేపించాయి. వారి వ్యాఖ్యలతో ఈ కేసు నిలవదని స్పష్టమైంది.

కవిత ఓ ఫైటర్. జైలు నుంచి విడుదలయ్యాక పార్టీ బలోపేతం కోసం ఆమె పోరాటం కొనసాగుతుంది. బీ జే పి తో పొత్తు లో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నేతలు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు వాదనకు నిలవవు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి లో భాగస్వామి.

ఆ పార్టీ నేత సిసోడియా కు బెయిల్ ఇదే కేసులో బెయిల్ వస్తే, కాంగ్రెస్ స్వాగతించి కవిత విషయం వచ్చే సరికి వేరే విధంగా మాట్లాడటం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. సిసోడియా కు బెయిల్ వస్తే బీజేపీ ఆప్ కుమ్మక్కయినట్టా? తప్పుడు వాదనలతో కాంగ్రెస్ ప్రజల్లో మరింత పలుచన కావొద్దు. బీ ఆర్ ఎస్ కు బీ జే పి తో ఎలాంటి పొత్తు ఉండదు.

LEAVE A RESPONSE