Suryaa.co.in

Editorial

ముషీరాబాద్‌ నుంచి కవిత పోటీ?

– పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు?
– సికింద్రాబాద్‌ నుంచి తలసాని తనయుడు సాయి కిరణ్‌?
– జూబ్లీహిల్స్‌ నుంచి రావుల శ్రీధర్‌రెడ్డి?
– కంటోన్మెంట్‌ నుంచి క్రిశాంక్‌?
– ఖైరతాబాద్‌ నుంచి దాసోజు శ్రవణ్‌?
– స్టేషన్‌ ఘనపూర్‌ నుంచి కడియం కావ్య?
– 27 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల పరిశీలన?
– సోషల్‌మీడియాలో హల్‌చల్‌
( మార్తి సుబ్రహ్మణ్యం-హైదరాబాద్‌)

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 27 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ నాయకత్వం.. కొత్త అభ్యర్ధుల పేర్లు పరిశీలిస్తోందన్న వార్త సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 27 మంది పేర్లు వివిధ నియోజకవర్గాలకు పరిశీలిస్తోందన్నది దాని సారాంశం. అయితే దీనిపై బీఆర్‌ఎస్‌ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అలాగని ఖండన వార్త కూడా విడుదల కాకపోవడం ప్రస్తావనార్హం.

ఆ ప్రకారంగా.. హైదరాబాద్‌ జిల్లాలోని ముషీరాబాద్‌ నుంచి కేసీఆర్‌ కుమార్తె కవిత, ఖమ్మం జిల్లా పాలేరు నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్‌ నుంచి మంత్రి తలసాని తనయుడు తలసాని సాయికిరణ్‌, జూబ్లీహిల్స్‌ నుంచి రావుల శ్రీధర్‌రెడ్డి, కంటోన్మెంట్‌ నుంచి మన్న క్రిశాంక్‌, ఖైరతాబాద్‌ నుంచి దాసోజు శ్రవణ్‌, స్టేషన్‌ ఘనపూర్‌ నుంచి కడియం కావ్య పేర్లు పరిశీలిస్తున్నారన్న కథనం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీన్నిబట్టి చూస్తే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను చాలామంది మారుస్తున్నట్లు స్పష్టమవుతోంది.

1 – కొత్తగూడెం – గడల శ్రీనివాస రావు
2 – మెదక్ – మైనంపల్లి రోహిత్ రావు
3 – పాలేరు – తుమ్మల నాగేశ్వరరావు
4 – మునుగోడు – గుత్తా అమిత్ రెడ్డి
5 – కోదాడ – జలగం సుధీర్ / మహేందర్ రెడ్డి
6 – కూకట్ పల్లి – గొట్టిముక్కల వెంకటేశ్వర రావు…(G V R )
7 – ఆలేరు – బూడిద బిక్షమయ్యా గౌడ్
8 – ముషీరాబాద్ – కల్వకుంట్ల కవిత
9 – జూబ్లీ హిల్స్ – రావుల శ్రీధర్ రెడ్డి
10 – కంటోన్మెంట్ – మన్నే క్రిషాంక్
11 – ఇబ్రహింపట్నం – మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి
12 – మహేశ్వరం – పట్లోల్ల కార్తిక్ రెడ్డి
13 – కోరుట్ల – కల్వకుంట్ల సంజయ్ రావు
14 – పటాన్ చెరు – నీలం మధు ముదిరాజ్
15 – మంచిర్యాల్ – నడిపల్లి విజేందర్
16 – బాన్సువాడ – పోచారం భాస్కర్ రెడ్డి
17 – హుజూరాబాద్ – పాడి కౌశిక్ రెడ్డి
18 – దుబ్బాక – కొత్త ప్రభాకర్ రెడ్డి
19 – కుత్బుల్లాపూర్ – శంబీపూర్ రాజు
20 – ఖైరతాబాద్ – దాసొజ్ శ్రావణ్
21 – సికింద్రాబాద్ – తలసాని సాయి కిరణ్
22 – స్టేషన్ ఘనపూర్ – కడియం కావ్య
23 – ఖానాపూర్ – పూర్ణ చందర్ బరావత్
24 – పరకాల – నాగుర్ల వెంకన్న
25 – జనగాం – పల్ల రాజేశ్వర్ రెడ్డి /పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
26 – వరంగల్ ఈస్ట్ – బస్వరాజు సారయ్య
27 – పాలకుర్తి – ఎర్రబెల్లి ప్రేమ్ కుమార్ రావు

LEAVE A RESPONSE