దళితమోర్చా రాష్ట్ర అద్యక్షుడు ఎస్.కుమార్
గత 20 ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నా. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీ చేశాను. 6గురి అధ్యక్షుల వద్ద పనిచేశాను. ఎవరి స్థాయిల్లో వారి పనిచేసి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. కానీ బండి సంజయ్ మీద జరుగుతున్న దాడి మరే అధ్యక్షుడి మీద జరగలేదు.
ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న బండి సంజయ్ అధ్యక్షుడిగా ఎదిగి… కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అద్బుతమైన పోరాటాలు చేశారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్న బండి సంజయ్ ను అవమానిస్తూ వార్తలు రావడం అత్యంత బాధ కలిగిస్తోంది.
నిజానికి బండి సంజయ్ అధ్యక్ష పదవీ కాలం మార్చిలోనే ముగిసింది. నడ్డా పదవీ కాలం కొనసాగించిన తరువాత… తరుణ్ చుగ్ బండి సంజయ్ కొనసాగుతారని చెప్పిన తరువాత కూడా పదేపదే బండి సంజయ్ పనైపోయిందని వార్తలు రావడం దుర్మార్గం.
దీనివెనుక కేసీఆర్ కుట్ర ఉంది. కాంగ్రెస్ కుట్ర ఉంది. బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. అధికారంలోకి వచ్చే అవకాశముందని గ్రహించి పార్టీ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్రలో భాగంగానే కేసీఆర్, కాంగ్రెస్ పార్టీలు దుష్ర్పచారం చేస్తున్నాయి.
బీజేపీ ఆధ్వర్యంలో బండి సంజయ్ అనేక పోరాటాలు చేశారు. ఆయన వ్యక్తి కాదు… పార్టీకి రాష్ట్ర అధ్యక్షులనే విషయాన్ని మర్చిపోయి.. అవమానించడం ఏమాత్రం సరికాదు.. ఇది సహించరాని విషయం.బీఆర్ఎస్, కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఐక్యమై తిప్పికొట్టాల్సిన సమయం వస్తుంది.
ఒకరంటారు.. బండి సంజయ్ కు కళ్లు నెత్తికెక్కాయట.. ఎందుకు ఎక్కుతాయ్.. పాదయత్ర పేరుతో వందల కిలోమీటర్లు నడిచినందుకా? ఎండనక, వాననక ప్రజల్లోకి వెళుతూ కాళ్లు బొబ్బలెక్కినా పార్టీ కోసం పనిచేస్తున్నందుకా? దేనికోసం కళ్లు నెత్తికెక్కుతాయి?