– మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యక్తిగత స్వార్థపూరిత ఎజెండా తోనే యాసంగి ధాన్యం కొనుగోలు అంశాన్ని లేవనెత్తుతున్నాడు. యాసంగిలో వరి పంట వేయొద్దు అన్న పెద్ద మనుషులు వరి ధాన్యం కొనుగోలు అంశం ముందుకు ఎలా వస్తుందో వారే చెప్పాలి. తరతరాలుగా తెలంగాణ లో వరి సాగు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు వారికి సరైన మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేశాయి . ముఖ్యమంత్రి రోజువారీ పాలనలో అవగాహనారాహిత్యం వల్లనే కొనుగోలు సమస్య ఏర్పడుతుంది.
ఇది కేవలం స్వార్థపూరిత రాజకీయ ఎత్తుగడ మాత్రమే. హైదరాబాద్ లోని తన బినామీ సంస్థలపై గత వారం రోజులుగా జరుగుతున్న ఐటి దాడుల నుండి తెలంగాణ ప్రజల దృష్టి ని పక్కదారి పట్టించేందుకే జాతీయ స్థాయి అని, యాసంగి వరి కొనుగోలు అంశాన్ని కేంద్రం పై పోరాటం చేస్తానని రాజకీయం చేస్తున్నాడు. అప్పుచేసి కమీషన్ల కోసం ప్రాజెక్టులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి కోట్లాది రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి లూటీ చేసింది వాస్తవం కాదా.
ఈరోజు రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తూ కేంద్రం చేత యాసంగి వరి కొనుగోలు చేయించ లేని పెద్దమనిషి ఉద్యమ వీరుల మని తెలంగాణ ప్రతిష్టను దిగజారుతున్నాడు. ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించి అసలు సిసలైన ఉద్యమకారులను పార్టీ నుండి బయటకు పంపించి, తెలంగాణ అమరుల సమాధులపై తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాక్షస పాలన సాగిస్తూ తన ఉనికికి ప్రమాదం ఏర్పడినప్పుడే ఉద్యమం గుర్తొస్తుందా కేసీఆర్ .
తెలంగాణ ఏర్పాటు తర్వాత నీవు నీ కుటుంబం దోచుకొని దాచుకున్నదంత కక్కించే రోజులు వస్తున్నాయి. నిన్ను శంకరగిరి మాన్యాలు లకు తెలంగాణ ప్రజలు పంపడానికి సిద్ధంగా ఉన్నారు . తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో రెండుసార్లు నిన్ను అధికారంలోకి తీసుకు వస్తే నిస్సిగ్గుగా పీకే తో పని చేయించుకుంటున్న అన్నపుడే నీవు నైతికంగా ఓడిపోయినట్లు కెసిఆర్. గల్లీలో ప్రెస్ మీట్ ఢిల్లీలో సాష్టాంగ నమస్కారం ఇది కేసీఆర్ నైజం. తన కుటుంబ అక్రమాలు బయటపడకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టిన ఘనత కెసిఆర్ దే.
మోడీకి ఎన్నికలప్పుడు ఓట్లు చీల్చే ఒక పెద్దమనిషి కెసిఆర్ రహస్య మిత్రుడే ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పిస్తున్నాడు . ముఖ్యమంత్రి కేసీఆర్ రోజు వారి పాలనలో పట్టు లేకపోవడం వల్లే ఇన్ని అనర్థాలు తెలంగాణ ప్రతిష్ట మసకబారిపోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజల ఓట్లు దండుకుని కనీసం రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకపోవడం అత్యంత దారుణం. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే గ్యాస్ , డీజిల్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం వారిది ప్రజావ్యతిరేక ప్రభుత్వమని నిరూపించుకుంది . తక్షణమే గ్యాస్ ధర తగ్గించి ప్రజలకు మేలు చేయాలని డిమాండ్ చేస్తున్నా.
మోడీ కేసీఆర్ రాజకీయ అవకాశవాదులు వీరి వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు వీరి వ్యక్తిగత ఎజెండా వల్ల దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలారా వ్యక్తిత్వం కోసం ప్రజల ధన మాన ప్రాణాలను పణంగా పెట్టే ప్రమాదం ఉంది. ఈ పీకేను,కేసీఆర్ ను రానున్న ఎన్నికల్లో బొంద పెట్టేందుకు ఎంతో చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.