Suryaa.co.in

Telangana

మళ్లీ సీఎం అవుతారనే నమ్మకం కేసీఆర్ కే లేదు

-నమ్మకం ఉంటే టీఆర్ఎస్ ను రద్దు చేసి కొత్త దుకాణం ఎందుకు తెరుస్తారు?
-తెలంగాణలో అప్పులు తీరాలన్నా… సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా బీజేపీ అధికారంలోకి రావాల్సిందే
-డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ సమగ్రాభివ్రుద్ధి సాధ్యం
-ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువైన హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచాలు…
-బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో హత్యలు, అత్యాచారాలు, ర్యాగింగ్ లతో రెచ్చిపోతున్న రౌడీలు
-తెలంగాణ అమర వీరుల ఆశయాలను తుంగలో తొక్కిన కేసీఆర్
-ఉస్మానియా, కాకతీయ విద్యార్థుల భవిష్యత్ ను నాశనం చేస్తున్న సీఎం
– ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల మయం చేశారు.
-గతంలో మద్యంపై 10 వేల కోట్ల ఆదాయముంటే… నేడు రూ.40 వేల కోట్లు సంపాదిస్తున్నారు
-కేసీఆర్ పాలనలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిందని నేషనల్ క్రైం బ్యూరో రికార్డులే చెబుతున్నాయి
-కాళేశ్వరం ద్వారా వేల కోట్ల దోచుకోవడం తప్ప ఒక్క చుక్క నీరు కూడా రాలేదు
-కృష్ణా జలాల్లో తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టి ప్రజల నోట్లో మట్టి కొట్టిన ద్రోహి కేసీఆర్
-టాయిలెట్ల నిర్మాణానికి, హరిత హారానికి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దోచుకున్న దొంగ కేసీఆర్
-తెలంగాణ అభివ్రుద్ధిపైనా, కేంద్రం ఇస్తున్న నిధులపైనా బహిరంగ చర్చకు సిద్దమని సవాల్ విసిరినా స్పందించని మూర్ఖుడు కేసీఆర్
-మాజీ ఎంపీ బూర నర్సయ్య జన్మదిన వేడుకల్లో కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్

టిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ముఖ్యమంత్రి కేసీఆర్ కే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ‘‘ఒకవేళ మళ్లీ ముఖ్యమంత్రి అవుతాననే నమ్మకం కేసీఆర్ కు ఉంటే టీఆర్ఎస్ పార్టీని రద్దు చేసి బీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ఎందుకు పెడతారు? ఆ నమ్మకం లేదు కాబట్టే బీఆర్ఎస్ పేరుతో కొత్త దుకాణం తెరిచి దేశమ్మీద పడ్డారు’’అని ఎద్దేశా చేశారు. అప్పుల కుప్పగా మారిన తెలంగాణ అన్ని విధాలా అభివ్రుద్ధి చెందాలన్నా…. నిధులు సమకూరాన్నా….ఉద్యోగులకు సక్రమంగా జీతాలు రావాలన్నా… సంక్షేమ పథకాలన్నీ అమలు కావాలన్నా బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు.

బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం నియోకవర్గంలోని బొంగుళూరు సమీపంలోని కళ్లెం జంగారెడ్డి గార్డెన్ లో జరిగిన జన్మదిన వేడుకలకు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, కోశాధికారి భండారి శాంతికుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా అర్బన్, రూరల్, నల్గొండ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, బొక్క నర్సింహారెడ్డి, కంకణాల శ్రీధర్ రెడ్డి, సీనియర్ నేత తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే…..తెలంగాణ ఉద్యమం పేరుతో పెద్ద ఎత్తున దోచుకున్న కేసీఆర్.గతంలో చేసిన అప్పులు తీర్చలేక కేసీఆర్ వాహనాలను ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు.అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత కేసీఆర్ ఆస్తులు అనూహ్యంగా పెరిగాయి. తెలంగాణ వచ్చాక పేదల బతుకులు మారలేదు.తెలంగాణ రాకముందు కంటే స్వరాష్ట్రం వచ్చాకే ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో కేసీఆర్ పాలనలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.కేసీఆర్ పాలనలో ర్యాగింగ్, అత్యాచారాలు, ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి.

బీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు మద్దతుంటే అత్యాచారాలు, హత్యలు, ర్యాగింగ్ చేసిన దుండగులపై చర్యలు తీసుకోవడం లేదు… గూండాలు, రౌడీలు రెచ్చిపోతున్నా పట్టించుకోవడం లేదు.మెడికో ప్రీతి నాయక్ ఆత్మహత్యపైనా, కుక్కల దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయినా, ఆర్టీసీ ఉద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించని మూర్ఖుడు కేసీఆర్.తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిన ద్రోహి కేసీఆర్.ఉస్మానియా, కాకతీయ వర్శిటీ విద్యార్థుల భవిష్యత్ నాశనమయ్యేలా కేసీఆర్ చర్యలు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల మయం చేశారు. గతంలో మద్యంపై 10 వేల కోట్ల ఆదాయముంటే… నేడు రూ.40 వేల కోట్లు సంపాదిస్తున్నారు. కేసీఆర్ పాలనలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిందని నేషనల్ క్రైం బ్యూరో రికార్డులే చెబుతున్నాయి. కాళేశ్వరం ద్వారా వేల కోట్ల దోచుకోవడం తప్ప ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. కాళేశ్వరం నీటిని ఫాంహౌజ్ కు మళ్లించిన కేసీఆర్.క్రిష్ణా జలాల్లో తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టి ప్రజల నోట్లో మట్టి కొట్టిన ద్రోహి కేసీఆర్.

575 టీఎంసీ నీటి వాటా రావాల్సి ఉండగా… 299 టీఎంసీల నీటికే ఒప్పుకుని సంతకం చేసిన ద్రోహి కేసీఆర్. కేంద్ర నిధులన్నీ దారి మళ్లించిన ఘనుడు కేసీఆర్. టాయిలెట్ల నిర్మాణానికి, హరిత హారానికి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దోచుకున్న దొంగ కేసీఆర్. తెలంగాణ అభివ్రుద్ధిపైనా, కేంద్రం ఇస్తున్న నిధులపైనా బహిరంగ చర్చకు సిద్దమని సవాల్ విసిరినా స్పందించని మూర్ఖుడు కేసీఆర్. నిరుద్యోగ భ్రుతి, రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు, గిరిజన బంధు సహా హామీలను అమలు చేయని మోసగాడు కేసీఆర్.

కేసీఆర్ నిరంతరం తాగడంతోనే బిజీగా ఉన్నారు.. పంజాబ్ సీఎం ఆయనకు దోస్త్. సీఎం కేసీఆర్ 8 ఏళ్లుగా ఫాంహౌజ్, ప్రగతి భవన్ కే పరిమితం… ప్రజలకు చేసిందేమీ లేదు. టీఆర్ఎస్ మూతపడ్డ ఫైనాన్స్ దుకాణం…. ఆ దుకాణానికి పెట్టిన కొత్త పేరే బీఆర్ఎస్. బీఆర్ఎస్ లో చేరే వాళ్లంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ నేతలే.నెత్తిమీద రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా పనికి రాని నేతలే బీఆర్ఎస్ లో చేరుతున్నారు.

కేసీఆర్ కు మళ్లీ సీఎం అవుతాననే నమ్మకం ఉంటే బీఆర్ఎస్ పార్టీని ఎందుకు పెడతారు? ఆ నమ్మకం లేదు కాబట్టే బీఆర్ఎస్ పేరుతో కొత్త దుకాణం తెరిచారు.తెలంగాణలో కేసీఆర్ చేసిన అప్పులన్నీ తీర్చాలంటే కేంద్రంలో అధికారంలోకి ఉన్న బీజేపీతోనే సాధ్యం. తెలంగాణకు నిధులు రావాలన్నా…. ఉద్యోగులకు సక్రమంగా జీతాలు రావాలన్నా… సంక్షేమ పథకాలన్నీ అమలు కావాలన్నా బీజేపీతోనే సాధ్యం. తెలంగాణ అన్ని విధాలా అభివ్రుద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే సాధ్యం. తెలంగాణలో అమర వీరుల ఆశయాలు నెరవేరాలంటే కేసీఆర్ పాలనను తరిమి కొట్టాల్సిందే.

LEAVE A RESPONSE