-డబుల్ బెడ్రూం ఇండ్లేవి? రుణమాఫీ ఏది? ఉద్యాగాలేవి? నిరుద్యోగ భ్రుతి ఏది?
-పోడు భూములకు పట్టాలేవి? ఉచిత ఎరువుల పంపిణీ ఏది?
-దళిత బంధు, గిరిజన బంధు ఏది? 12 శాతం గిరిజన రిజర్వేషన్లేవి?
-మిగులు రాష్ట్రం రూ.5 లక్షల కోట్ల అప్పుచేసి తెలంగాణను ఎందుకు దివాళా తీయించావ్?
-జీతాలు, ఫించన్లు కూడా ఇయ్యలేని దుస్థితికి ఎందుకు తీసుకొచ్చినవ్?
-రాష్ట్రాన్ని అవినీతికి కేరాఫ్ అడ్డాగా చేసి దోచుకున్న కేసీఆర్ కుటుంబం
-బీఆర్ఎస్ పార్టీని పెట్టింది తెలంగాణను దోచుకోవడానికేనా?
-ఒక కుటుంబం లక్ష కోట్లు దోచుకోవడమేనా తెలంగాణ మోడల్ అంటే
-మెట్ పల్లిలో మిషన్ భగీరథ నీళ్లు యాడ ఇచ్చినవో దమ్ముంటే చూపించు
-బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానన్న హామీ ఏమైంది?
-కొండగట్టు మ్రుతుల కుటుంబాలకు పరిహారం కూడా అందించని నీచుడు సీఎం
-గల్ఫ్ కార్మికుల బాధలు వర్ణణాతీతం…చచ్చిన శవాన్ని తీసుకురాలేని అసమర్థుడు కేసీఆర్
-గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదు?
-ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణపై టీఆర్ఎస్ ను నిలదీయండి
-చేతగాకుంటే రాసివ్వు…..నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్దరించే బాధ్యత మాది
-తెలంగాణ, సమైక్యాంధ్ర సెంటిమెంట్ ను రగిల్చి మళ్లీ రాజకీయ లబ్ది పొందేందుకు కేసీఆర్, జగన్ కుట్ర
-కేసీఆర్ అవినీతి, అరాచక, కుట్రల బండారాన్ని బయటపెడతా
-తెలంగాణ పంచాయతీ, మున్సిపాలిటీల అభివ్రుద్ధి నిధులన్నీ కేంద్రానివే
-మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’తో చైనా బజార్లన్నీ భారత్ బజార్లవుతున్నవ్
-స్థానిక పరిశ్రమల నుండే ఆయా బజార్లలో వస్తువుల విక్రయం
-బీజేపీ అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక పాలసీ రూపొందిస్తాం
-ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పునరుద్దరిస్తాం
-అర్హులందరికీ ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తాం…
-పక్కా గ్రుహాలు కట్టిస్తాం….. రైతులకు పంట నష్ట పరిహారం అందిస్తాం
-ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలన్నీ కొనసాగించి తీరుతాం
-వడ్ల కొనుగోలు పైసలన్నీ కేంద్రానివే….
-వడ్లు సేకరించి ఎఫ్ సీఐకి అప్పగించినందుకు సీఎంకు బ్రోకరేజీ కమీషన్ కూడా కేంద్రం ఇస్తోంది
-రైతు బంధు ఇచ్చి రైతులకు సబ్సిడీలన్నీ బంద్ చేసిన మోసగాడు కేసీఆర్
-చినుకు పడితే అంధకారమయ్యే హైదరాబాద్ పవర్ ఐలాండ్ గా మారిందనడం హస్యాస్పదం
-మెట్ పల్లి ‘‘ప్రజా సంగ్రామ యాత్ర’’లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్
బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
‘‘డబుల్ బెడ్రూం ఇండ్లేవి? రుణమాఫీ ఏది? ఇంటికో ఉద్యోగమేది? నిరుద్యోగ భ్రుతి ఏది? పోడు భూములకు పట్టాలేవి? ఉచిత ఎరువుల పంపిణీ ఏది? దళిత బంధు, గిరిజన బంధు ఏది? గిరిజనులకు 12 శాతం గిరిజన రిజర్వేషన్లేవి? వీటన్నింటిపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పిన తరువాతే దేశం గురించి మాట్లాడాలి’’ అని పేర్కొన్నారు.
తెలంగాణను దేశానికి మోడల్ గా చేశామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘‘మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి ప్రజలను బిచ్చగాళ్లను చేయడమేనా తెలంగాణ మోడల్ అంటే… ఒకే కుటుంబం లక్ష కోట్లు దోచుకోవడమెలా అనేది దేశానికి చాటిచెప్పడమేనా తెలంగాణ మోడల్ అంటే’’ అని దుయ్యబట్టారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మెట్ పల్లికి విచ్చేసిన బండి సంజయ్ కు భారీ ఎత్తున జనం తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.