సుస్థిర వ్యవసాయం దిశగా తెలంగాణ

– వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్ హోటల్ షెరటాన్ లో ‘సాంకేతికతతో కూడిన సుస్థిర వ్యవసాయం’పై బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన స్మార్ట్ అగ్రి సమ్మిట్ 2022లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సుబీర్ చక్రవర్తి, జాతీయ వర్షాధార ప్రాంతాల అభివృద్ధి అథారిటీ, కమీషన్ ఆఫ్ డబులింగ్ ఫార్మర్స్ ఇన్ కం చైర్మన్ అశోక్ దల్వాయి ఐఏఎస్

తెలంగాణ ఏర్పడే నాటికి కరువు పరిస్థితులు, సాగు, తాగునీటికి ఇబ్బందులు, కరంటు లేక రైతుల వలసలు .వ్యవసాయాన్ని ఉపాధిగా చూడలేని పరిస్థితులు.అలాంటి పరిస్థితుల్లో ఆవిర్భవించిన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందదని ఈ రంగంపై దృష్టిసారించారు. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఈ రంగానికి అవసరమైన సదుపాయాల కల్పనపై దృష్టిసారించారు.

మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు పటిష్ట పరిచి నీటితో నింపడంతో భూగర్భజలాలు పెరిగాయి.ప్రపంచంలోనే ఒక అధ్బుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశాం.రైతుబంధుతో పెట్టుబడి, రైతుభీమాతో భరోసా, రుణమాఫీ, సాగునీటి సదుపాయం, ఉచితంగా 24 గంటల కరంటు, అందుబాటులో విత్తనాలు , ఎరువులు ఉంచడం జరిగింది. దీంతో వ్యవసాయం పురోగతి చెంది 2 కోట్ల 10 లక్షల ఎకరాలు సాగులోకి రాగా ఈ ఏడాది వానాకాలంలో వరి సాగు 68 లక్షల ఎకరాలకు చేరుకోవడం ఆల్ టైమ్ రికార్డ్ సాధించి దేశానికి అన్నపూర్ణగా నిలిచింది.

మారిన వ్యవసాయ పరిస్థితులను గమనిస్తే 2001 లో ఎకరా భూమి రూ.15 వేల నుండి రూ.30 వేలు ఉండేది .. తెలంగాణ ఆవిర్భావ సమయంలో రూ.2 లక్షల నుండి రూ.3 లక్షలు ఉండేది .. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యం మూలంగా తెలంగాణ ఏ మూలకు వెళ్లినా ఎకరా ధర రూ.20 లక్షలకు తక్కువ లేదు.

వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చి జాతి సంపద పెంపుకు దోహదపడుతున్నా కేంద్రం సహకారం లేకపోవడం దురదృష్టకరం.అయినప్పటికీ భవిష్యత్ అంతా తెలంగాణదే అని మరింత ప్రోత్సాహం ఇస్తాం. పర్యావరణం, వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయరంగాన్ని సుస్థిరం చేయాల్సిన అవసరం నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సాంకేతికను ఉపయోగించుకునేందుకు ఈ సదస్సు తోడ్పడుతున్నదని భావిస్తున్నాను.

తెలంగాణ వాతావరణ పరిస్థితులలోనే కాకుండా రోడ్డు, వాయు మార్గాలు సుస్థిర వ్యవసాయానికి సానుకూలంగా ఉన్నాయి.పంట సాగు నుండి కోత వరకు కోత నుండి మార్కెటింగ్ వరకు పరిష్కారాలు చూయించాం.

హైదరాబాద్ హోటల్ షెరటాన్ లో ‘సాంకేతికతతో కూడిన సుస్థిర వ్యవసాయం’పై బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన స్మార్ట్ అగ్రి సమ్మిట్ 2022లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సుబీర్ చక్రవర్తి, జాతీయ వర్షాధార ప్రాంతాల అభివృద్ధి అథారిటీ, కమీషన్ ఆఫ్ డబులింగ్ ఫార్మర్స్ ఇన్ కం చైర్మన్ అశోక్ దల్వాయి ఐఏఎస్, ఐటీసీ లిమిటెడ్ , సచిన్ శర్మ, రామ్ కౌండిన్య (డీజీ ఫెడరేషన్ ఆల్ ఇండియా సీడ్ ఇండస్ట్రీ) పి.చంద్రశేఖర (డీజీ, మేనేజ్) సుశీల చింతల (సీజీఎం, నాబార్డ్), టి.నారాయణ రెడ్డి (అప్మా ప్రెసిడెంట్), జయంత చక్రవర్తి (బీసీసీ) తదితరులు.

Leave a Reply