టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్
ఇబ్రహీం పట్నం సంఘటన లో 34 మధికి ఆపరేషన్ జరిగితే 4 మహిళలు చనిపోయారు.చాలా గొప్పగా మాటలు చెబుతాడు హరీష్ రావు.ఒక చిన్న ఆపరేషన్ లో 4 చనిపోయారు అంటే కేసిఆర్ ప్రభుత్వం పనితీరు అర్థమౌతుంది. వైద్య రంగంలో వైఎస్ ను గుర్తు చేసుకోవాలి. బాసర,సిద్దిపేట,రంగారెడ్డి జిల్లాలో పురుగుల అన్నం విద్యార్థులకు పెడుతున్నారు. ప్రతి జిల్లాలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడతాయా అన్నారు.హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరు,ఏడు బ్రాంచీలు పెడుతున్నారు. వైద్య, విద్య రంగాలని బ్రష్టు పట్టిస్తున్నారు.ఎందుకు వైద్య శాఖను మెరుగు పరుచలేక పోతున్నారు?
ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన మందులు,వైద్యులు, మౌలిక సదుపాయాలు ఉండవు. ఈ ఘటన చాలా దురదృష్టకరం హరీష్ రావు వహిస్తూ రాజీనామా చెయ్యాలి.మరిన్ని ప్రాణాలు బతికించినట్లు అవుతుంది. ఇక్కడ ఏం చేయలేదు కానీ బీహార్ కి వెళ్లి మాజీ సైనికులకు నష్టపరిహారం ఇస్తున్నాడు. రాజకీయాల కోసం ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకు వెళతాం. వైద్య అధికారులు చేతులు దులుపుకునే పని చేస్తుంది. చనిపోయిన కుటుంబానికి కోటి రూపాయల, బాధితులకు 5 లక్షలు ఇవ్వాలి.పనికి రాని ప్రాజెక్ట్ ల మీద లక్షల కోట్లు పెట్టీ కమిషన్లు తినడం కాదు.ప్రజలకు మెరుగైన వైద్య,విద్య రంగాలు కావాలి.